Telangana high court: అంబులెన్సులు లేకుంటే..గుర్రాలను వాడండి..తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు చురకలు..సూచనలు

కరోనా కట్టడికి చేపడుతున్న చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు సరిపోవని వ్యాఖ్యానించింది.‘‘కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను తరలించటానికి అంబులెన్సులు అందుబాటులో లేకపోతే గుర్రాలను వాడాలని’’ సూచించింది.

Telangana High Court Fires On State Government

Telangana High Court fires on state government : తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కరోనా కట్టడి ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించగా..అన్ని కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది. కానీ ప్రభుత్వం చెప్పిన విషయాలపై అసంతృప్తి వ్యక్తంచేసిన హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ప్రభుత్వం చెబుతున్నది ఒకటి చేసేది మరొకటి అంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యింది.

కరోనా కట్టడికి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు ఏపాటి? అని ప్రశ్నించింది. ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సరిపోవని వ్యాఖ్యానించింది. నైట్ కర్ఫ్యూతో పాటు అన్ని సమావేశాలు, వేడుకలను 50 శాతం కుదించాలని ఆదేశించింది. అంబులెన్స్ డ్రైవర్లు చేతివాటానికి పాల్పడకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సూచించింది. అంతేకాదు ప్రభుత్వానికి ధర్మాసనం పలు కీలక సూచనలు చేస్తూ..‘‘కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను తరలించటానికి అంబులెన్సులు అందుబాటులో లేకపోతే గుర్రాలను వాడాలని’’ సూచించింది. కరోనా బాదితులకు సరిపడా ఆక్సిజన్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని..ఈ విషయం ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని సూచించింది. కరోనా పేషెంట్లకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పింది.

ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం వేచి చూడకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు పేషెంట్లకు వైద్యం అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్ ను సరఫరా చేసేందుకు వాయుమార్గాలను సిద్ధంగా ఉంచాలని భారత వాయుసేనను కోరింది. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా కరోనా చికిత్సను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని… తద్వారా కోవిడ్ సెంటర్లపై ఒత్తిడిని తగ్గించాలని ఆదేశించింది. పోలీసులకు కూడా మాస్క్ కంపల్సరీ చేయాలని చెప్పింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయటానికి ప్రభుత్వానికి ధర్మాసం ఇచ్చే చివరి అవకాశం ఇది అనీ స్పష్టంచేసింది. పూర్తి నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మే 5కి వాయిదా వేసింది.