నాలుగు వారాలు టైం ఇస్తున్నాం..! తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటీష‌న్‌పై హైకోర్టు సంచలన తీర్పు

పార్టీ మారిన బీఆర్ఎస్ఎ మ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. స్పీకర్ కు నాలుగు వారాలు సమయం ఇచ్చింది

BRS MLAs

Telangana High Court : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని ఇటీవల బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానందగౌడ్ లు హైకోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. వారి పిటీషన్ లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా దానంపై అనర్హత వేటు వేయాలని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాకలు చేశారు. ఈ పిటీషన్లపై హైకోర్టు విచారణ చేపట్టి కీలక తీర్పు ఇచ్చింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటో కేసుగా విచారిస్తామని పేర్కొంది.

Also Read : Hyderabad CP : హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన సీవి ఆనంద్

విచారణ సందర్భంగా హైకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ పట్టించుకోవడం లేదంటూ పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.

Also Read : రఘునందన్ రావు‎ను అభినందించిన శ్రీధర్ బాబు

హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు 10టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టు తీర్పు ఇచ్చింది. నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తసీుకోవాలని చెప్పడం హర్షనీయం అన్నారు. స్పీకర్ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసు విచారిస్తామని హైకోర్టు చెప్పిందని మోహన్ రావు తెలిపారు. స్పీకర్ కు ఆదేశాలు ఇచ్చిన అనేక తీర్పులు ఉన్నాయి. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే కంటెమ్డ్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేస్తాం. ముగ్గురు ఎమ్మెల్యేతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకుంటాం అని గండ్ర మోహన్ రావు అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు