Hyderabad CP : హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన సీవి ఆనంద్

రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పై సీరియస్ గా ఉందని, డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తానని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు.

Hyderabad CP : హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన సీవి ఆనంద్

CV Anand

CV Anand : హైదరాబాద్ సీపీగా సీవి ఆనంద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రెండోసారి హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం వినాయక చవితి, మిలాద్ ఉన్ నబి పండుగలు ఉన్నాయి.. పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూస్తామని చెప్పారు. గతేడాది కూడా రెండు పండుగలు ఒకేసారి వచ్చాయి. అప్పుడు ప్రశాంతంగా జరిపాం. ప్రస్తుతం అన్ని రకాలుగా యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. పండుగ ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని అన్నారు.

Also Read :  హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి బదిలీ.. కొత్త సీపీ ఎవరంటే?

ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పార్ట్ ఆఫ్ పోలీసింగ్ గా కొనసాగుతుంది. ప్రజలు తప్పుగా అపార్ధం చేసుకుంటున్నారని సీవీ ఆనంద్ అన్నారు. నగర వ్యాప్తంగా క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పై సీరియస్ గా ఉందని, డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకుంటానని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సీవీ ఆనంద్ నగర సీపీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు.

సీవీ ఆనంద్‌ ఇంతకుముందు కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. 2021, డిసెంబర్ 24 నుంచి 2023 అక్టోబర్ 12 వరకు హైదరాబాద్ సీపీగా కొనసాగారు. అంతకుముందు ఆయన కేంద్ర సర్వీసుల్లో అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్ ఆఫ్ పోలీస్‌గా సేవలు అందించారు. 2017లో రాష్ట్రపతి పోలీసు పతకంతో పాటు ఇన్నోవేటివ్ లీడర్‌షిప్ అవార్డు కూడా అందుకున్నారు.