హైదరాబాద్ : పోలీసులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదంటు హెచ్చరించింది. ‘‘పోలీసులు యూనిఫాంకు ఓ బాధ్యత..గౌవరం ఉంటుందనీ..దానికో కోడ్ ఉంది…మీకంటూ ఓ నేమ్ ప్లేట్ ఉంటుంది…అవన్నీ వదిలేసి సాధారణ వ్యక్తుల్లా సివిల్ డ్రెస్‌లో వెళ్లి ఇష్టానుసారం వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమంటే మండిపడింది. అలా చేస్తే న్యాయాన్ని ధిక్కరించినట్లేననీ.. కోర్టు నిబంధనలకు వ్యతిరేకించినట్లేననీ అలా చేస్తే..కఠిన చర్యలు తీసుకుంటామని’’ కరీంనగర్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది.
కరీంనగర్‌లోని తన రిసార్ట్స్‌పై పోలీసులు తరచూ దాడిచేయడాన్ని వ్యతిరేకిస్తూ పుష్పాంజలి కంట్రీ రిసార్ట్స్ యాజమాన్యం హైకోర్టులో పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం సదరు రిసార్ట్స్ పై దాడి చేయవద్దని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన కరీంనగర్ పోలీసులు మరోసారి పుష్పాంజలి కంట్రీ రిసార్ట్స్ పై తరచు సివిల్ డ్రస్ లో వెళ్లి దాడులకు పాల్పడి క్రమంలో మరోసారి వారు కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు విచారించిన న్యాయమూర్తి నేర శిక్షాస్మృతి కంటే పోలీసుల ఉత్తర్వులు గొప్పవి కావని..ఈ విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని సూచించింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నా పట్టించుకోకుండా సివిల్ డ్రెస్‌లో ఓ రిసార్ట్స్‌కు వెళ్లి హల్‌చల్ చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. పోలీసులు తమ పరిధి దాటి వ్యవహరించరాదని, తమ ఆదేశాలను అతిక్రమించి వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆగ్రహం వ్యక్తం చేసింది.