×
Ad

Kcr: కేసీఆర్‌ ఇంటి దగ్గర హైటెన్షన్.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అరెస్ట్‌

తెలంగాణ భవన్ దగ్గర సైతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్ నుండి బయటికి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించాయి.

  • Published On : February 1, 2026 / 05:13 PM IST

 

  • కేసీఆర్ సిట్ విచారణ వేళ ఉద్రిక్తతలు
  • నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నం
  • తెలంగాణ భవన్ దగ్గర పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట

Kcr: ఫోట్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ వేళ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. నందినగర్ లోని కేసీఆర్ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేసీఆర్ ఇంటి వైపునకు వెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు యత్నించాయి. క్యాన్సర్‌ ఆస్పత్రి రోడ్డు నుంచి కేసీఆర్‌ ఇంటికి వెళ్లేందుకు యత్నించాయి. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు బీఆర్ఎస్‌ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాయి. పోలీసులు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు.

అటు తెలంగాణ భవన్ దగ్గర సైతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్ నుండి బయటికి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తెలంగాణ భవన్ నుండి బయటకు వెళ్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

Also Read: ఏపీలో మరో వైసీపీ నేత ఇంటిపై దాడి.. నిప్పు పెట్టిన టీడీపీ శ్రేణులు