Attack On Forest Staff : ఫారెస్ట్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి.. భద్రాద్రి జిల్లా మంగలిగుంపులో హైటెన్షన్

భద్రాద్రి జిల్లాలోని మంగలిగుంపులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ పనులు నిర్వహిస్తుండగా, ఛత్తీస్ గఢ్ కు చెందిన 60మంది గుత్తికోయలు అక్కడికి చేరుకుని సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

Attack On Forest Staff : భద్రాద్రి జిల్లాలోని మంగలిగుంపులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ పనులు నిర్వహిస్తుండగా, ఛత్తీస్ గఢ్ కు చెందిన 60మంది గుత్తికోయలు అక్కడికి చేరుకుని సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గుత్తికోయలు కర్రలతో విచక్షణారహితంగా దాడులు చేయడంతో ఫారెస్ట్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుత్తికోయలపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు ఫారెస్ట్ సిబ్బంది.

ఎవరీ గుత్తికోయలు..
దాదాపు రెండు దశాబ్దాలుగా ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన వేల మంది గిరిజనులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో ప్రత్యేకంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమంలో వేల మంది వలసదారులతో వందల గ్రామాలు ఏర్పడ్డాయి. కొండ ప్రాంతాల్లో పొలాలు సిద్ధం చేసుకున్నారు. పిల్లల్ని కూడా ఇక్కడే చదివిస్తున్నారు. ఎస్టీ సర్టిఫికెట్లు గానీ, భూమిపై హక్కులు గానీ లేకపోయినా ఆధార్, రేషన్ కార్డులతో సరిపెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

2005 నుంచి కొన్నేళ్ల పాటు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, సల్వాజుడుం దళాల మధ్య జరిగిన పోరులో సర్వం వదులుకుని ప్రాణాలు అరచేత పట్టుకొని దూర ప్రాంతాలకు పోయిన వేల కుటుంబాల్లో అత్యధికులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉంటున్నారు.

Forest Act: చెట్లు నరికితే ఇకపై జైలు శిక్ష కాదు.. రూ.500 ఫైన్!

ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు కూడా చాలామంది ప్రాణభయంతో తరలిపోయారు. అలాంటి వారికి ఇప్పుడు మరోసారి వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. తమ చేతుల నుంచి భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటూ తమకు ఆధారం లేకుండా చేస్తున్నారని వారు వాపోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు