Forest Act: చెట్లు నరికితే ఇకపై జైలు శిక్ష కాదు.. రూ.500 ఫైన్!

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా, చట్ట విరుద్ధంగా అటవీ ప్రాంతంలో చెట్లు నరికితే ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే వారు. అటవీ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడ్డా, కలప దొంగిలించినా ఇదే శిక్ష అమలయ్యేది.

Forest Act: చెట్లు నరికితే ఇకపై జైలు శిక్ష కాదు.. రూ.500 ఫైన్!

Forest Act

Forest Act: అటవీ ప్రాంతంలో చెట్లు నరికితే ఇకపై జైలు శిక్షకు బదులు రూ.500 జరిమానా విధించేలా కొత్త చట్టాన్ని రూపొందిస్తోంది కేంద్రం. ఈ మేరకు భారత అటవీ చట్టం (ఐఎఫ్ఏ)1927లో మార్పులు తీసుకురాబోతుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా, చట్ట విరుద్ధంగా అటవీ ప్రాంతంలో చెట్లు నరికితే ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే వారు. అటవీ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడ్డా, కలప దొంగిలించినా ఇదే శిక్ష అమలయ్యేది. అయితే, ఈ చట్టాన్ని మార్చాలని కేంద్ర పర్యావరణ శాఖ భావిస్తోంది. కొన్ని అటవీ చట్టాలను మార్చడం ద్వారా వాటిని క్రిమినల్ శిక్షల్లోంచి తొలగించాలనుకుంటోంది.

Indian Army: చైనా భాష తెలిసిన వారి నియామకం.. ఆర్మీ నోటిఫికేషన్ విడుదల

అటవీ చట్టాలకు సంబంధించి చిన్న తప్పులు లేదా నేరాలకు జైలు శిక్ష విధించడం వంటి క్రిమినల్ చట్టాల్ని రద్దు చేయాలనుకుంటోంది. జరిమానాల్లో కూడా మార్పులు చేయాలనుకుంటోంది. దీనివల్ల పౌరులపై భారం తగ్గుతుంది. ప్రజలపై వేధింపులు కూడా తగ్గుతాయి. అడవుల పరిరక్షణ కోసం రూపొందిందే ఐఎఫ్ఏ. రిజర్వుడ్, ప్రొటెక్టెడ్, గ్రామీణ అడవులతోపాటు, అటవీ వనరుల్ని, జీవ వైవిధ్యాన్ని, వణ్య ప్రాణుల్ని రక్షించేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది. అడవులకు నష్టం చేసే చర్యలను నిరోధించడమే ప్రధానంగా ఈ చట్టం లక్ష్యం. కొత్త చట్టం అమల్లోకి రావడానికి చాలా సమయం పడుతుంది.