Indian Army: చైనా భాష తెలిసిన వారి నియామకం.. ఆర్మీ నోటిఫికేషన్ విడుదల

అనేక సార్లు చైనా సైన్యం దుందుడుకు చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో చైనా సిబ్బందితో తరచూ మాట్లాడాల్సి వస్తోంది. అయితే, చైనా సైనిక అధికారుల్లో చాలా మందికి వాళ్ల మాతృ భాష అయిన మాండరిన్ తప్ప ఇంగ్లీష్, ఇతర భాషలు తెలియవు.

Indian Army: చైనా భాష తెలిసిన వారి నియామకం.. ఆర్మీ నోటిఫికేషన్ విడుదల

Indian Army

Indian Army: చైనా ప్రజల భాష అయిన మాండరిన్ తెలిసిన వారి కోసం భారత ఆర్మీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్, జూనియర్ మిలిటరీ కమాండర్స్ స్థాయి సిబ్బంది చైనా సైనికులు, అధికారులతో కమ్యూనికేట్ అయ్యేందుకోసం ఈ నియామకాల నోటిఫికేషన్ విడుదలైంది. లదాఖ్ సరిహద్దులో చైనాతో సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే.

INS Vikrant: ఆగష్టులో ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రారంభం.. చైనాకు ధీటుగా నిలవనున్న నౌక

అనేక సార్లు చైనా సైన్యం దుందుడుకు చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో చైనా సిబ్బందితో తరచూ మాట్లాడాల్సి వస్తోంది. అయితే, చైనా సైనిక అధికారుల్లో చాలా మందికి వాళ్ల మాతృ భాష అయిన మాండరిన్ తప్ప ఇంగ్లీష్, ఇతర భాషలు తెలియవు. దీంతో వాళ్లతో మాట్లాడటం మన సైనికాధికారులకు కష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే చైనా భాష అయిన మాండరిన్ వచ్చిన వారిని నియమించుకోవాలని సైన్యం ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం తాజాగా మాండరిన్ తెలిసిన వారి నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఇండియన్ ఆర్మీ. ఈ విషయంలో కేంద్రానికి ఆర్మీ కొన్ని ప్రతిపాదనలు పంపింది. దీని ప్రకారం సరిహద్దుకు సమీపంలో ఉండే ప్రాంతాల్లోని కొన్ని స్కూళ్లలో మాండరిన్ భాషను ప్రత్యేకంగా నేర్పిస్తున్నారు.

IndiGo: జీతాల పెంపు కోసం నిరసన.. సిక్ లీవులో ఇండిగో సిబ్బంది

ఈ భాష తెలిసిన వారిని సైన్యంలోకి చేర్చుకోవడం ద్వారా అవసరమైన సందర్భంలో మన అభిప్రాయాల్ని అక్కడి సైనికులు, అధికారులకు మరింత స్పష్టంగా చెప్పే వీలుంటుంది. ఇప్పటికే చైనా అందించే డాక్యుమెంట్స్ ట్రాన్స్‌లేషన్ కోసం ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీ వాడుతోంది. అయితే, ఇప్పుడు మాండరిన్ తెలిసిన వారి నియామకం పూర్తైతే అలాంటి ఇబ్బందులు తగ్గుతాయి.