Kamareddy High Tension
Kamareddy High Tension :కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ నేతల సవాళ్లతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వర్సెస్ షబ్బీర్ అలీగా పరిస్థితి మారింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, అరోరా భూముల విషయంపై కాంగ్రెస్ ఆరోపణలపై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి స్పందించారు. ఆరోపణలపై సరస్వతీ శిశుమందిర్ దగ్గర చర్చకు రావాలని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. ఈరోజు ఉదయం 10గంటలకు సరస్వతీ శిశు మందిర్ వద్దకు చర్చకు కాంగ్రెస్ నాయకులు రావాలని ఎమ్మెల్యే సవాల్ చేశారు.
Also Read : Also Read : Butta Renuka : వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు బిగ్‌షాక్.. ఆస్తుల వేలానికి సిద్ధమైన ఎల్ఐసీ
ఎమ్మెల్యే సవాల్‌కు కాంగ్రెస్ వర్గాలు సై అన్నాయి. చర్చకు సిద్ధమని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల సవాళ్ల నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులుసైతం రోడ్లపైకొచ్చారు.ఈ క్రమంలో ఒక కారు అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆ తరువాత నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బయటకు రాకుండా పోలీసులు ఆయన్ను గృహనిర్భందం చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. ప్రస్తుతం కామారెడ్డిలో 144 సెక్షన్ తరహాలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఎవరూ కూడా శిశుమందిర్ కు రావొద్దు.. ఎమ్మెల్యే
ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఎవరూ కూడా శిశు మందిర్ దగ్గరకు రావొద్దని బీజేపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోవాలి, ఇది పార్టీ సమస్య కాదు.. ఇది నా కుటుంబం మీద చేసిన ఆరోపణలు.. నిరూపించుకోవాల్సింది నేను. కాబట్టి కార్యకర్తలు ఎవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. నేను పోలీసులకు మాట ఇచ్చిన.. నా మాటకు విలువ ఇచ్చి రావొద్దు అంటూ వెంకటరమణారెడ్డి బీజేపీ శ్రేణులకు సూచించారు.