karimnagar : కరీంనగర్‌లో రూ. 1 కి చికెన్ బిర్యానీ ఆఫర్ పెట్టిన హోటల్ .. కస్టమర్ల తోపులాట .. భారీగా ట్రాఫిక్ జామ్

రూ.1 కే చికెన్ బిర్యానీ అంటూ పరుగులు తీశారు. రోడ్డుకి అడ్డంగా వెహికల్స్ పెట్టినందుకు రూ.200 ఫైన్ వదిలించుకున్నారు. కరీంనగర్‌లో ఓ హోటల్ పెట్టిన ఆఫర్ కోసం జనం తన్నుకున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

karimnagar

karimnagar : చీరలైనా, నగలైనా ఆఖరికి తినే బిర్యానీ అయినా ఆఫర్లో చాలా చవకగా దొరుకుతున్నాయి అంటే జనం పరుగులు తీయడం సర్వ సాధారణం. కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు కరీంనగర్ లో శుక్రవారమే కొత్తగా ప్రారంభించబడిన ఓ హోటల్ రూ.1 కి చికెన్ బిర్యానీ అంటూ ఆఫర్ ప్రకటించింది. ఇక జనాలు ఏ రేంజ్ లో గుమిగూడి ఉంటారో అర్ధమైపోయి ఉంటుంది.

Karimnagar Death Mystery : అంతుచిక్కని వ్యాధీ కాదు, చేతబడీ కాదు.. కరీంనగర్‌లో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు..!

కరీంనగర్‌లో రీసెంట్‌గా ‘ది ఎంపైర్ హోటల్’ అని ప్రారంభించారు. అసలే కొత్త హోటల్ బిజినెస్ పెంచుకోవాలనే ఉద్దేశంతో హోటల్ నిర్వాహకులు శనివారం రూ.1 కి చికెన్ బిర్యానీ అని బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇందులో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. ముందుగా వచ్చిన 100 కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. ఇక శనివారం ఉదయం కాగానే హోటల్ తెరువక ముందే జనం కిటకిటలాడారు. కొద్దిసేపు తోపులాట జరిగింది. మరోవైపు బిర్యానీ కోసం వచ్చిన వారి వాహనాలు రోడ్డుపై నిలిపివేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇక పోలీసులు జోక్యం తప్పనిసరైంది.

Karimnagar Incident : కరీంనగర్‌లో దారుణం.. పెళ్లి చేసుకున్నాడని ఇంటికి నిప్పు

ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలగడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. రూపాయి బిర్యానీ కోసం వచ్చిన వారికి రూ.200, రూ.250 ఫైన్లు వేశారు. హోటల్ ను ఆరోజు మూసివేయాల్సిందిగా ఆర్డర్ వేశారు. ఇక కస్టమర్ల వల్ల కలిగిన ఇబ్బందికి హోటల్ యజమానులు పోలీసులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. మరోవైపు రూ.1 చికెన్ బిర్యాని ఎలా ఉన్నా వెహికల్స్ కి ఫైన్ కట్టాల్సి వచ్చినందుకు కస్టమర్లు తిట్టుకుంటూ ఇంటి దారి పట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను @iShekhab అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.