Hyderabad : పనివారు, డెలివరీ సిబ్బంది మెయిన్ లిఫ్ట్ వాడితే జరిమానా.. ఓ హౌసింగ్ సొసైటీ నోటీసు వైరల్

ఓ హౌసింగ్ సొసైటీ మెయిన్ లిఫ్ట్ వాడిన పనివారు, డెలివరీ బాయ్స్ కు జరిమానా విధిస్తామంటూ నోటీసు పెట్టింది. సొసైటీ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది.

Hyderabad

Hyderabad : భాగ్యనగరంలో ఓ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన వార్త ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. హౌస్ మెయిడ్‌లు, డెలివరీ బాయ్స్, వర్కర్లు ఆ సొసైటీ మెయిన్ లిప్ట్ వాడితే జరిమానా విధిస్తామంటూ పెట్టిన నోటీసుపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

Gujarat : యోగా చేసిన మహిళకు జరిమానా.. ఎందుకో తెలుసా!

హైదరాబాద్‌లో ఓ హౌసింగ్ సొసైటీ మెయిన్ లిఫ్ట్‌ను ఉపయోగించిన పనివారు, డెలివరీ బాయ్‌లకు జరిమానా విధిస్తామని నోటీసు పెట్టడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. Shaheena Attarwala అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన పోస్టులు  రూ.1000 జరిమానా విధించబడుతుందని కనిపించింది. ఈ చర్యపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘సమాజంలో ఉన్న చీకటి రహస్యాలను దాచడానికి ప్రయత్నిస్తున్నాము.. మనకోసం కష్టపడి పనిచేసేవారిని మనతో కలిసి ఉండటానికి అనుమతించలేకపోతున్నాం.. వారు పట్టుబడితే నేరమా? రూ.1000 జరిమానా? ఇది బహుశా వారి జీతంలో 25%’ అనే శీర్షికతో షహీనా అత్తర్వాలా ఈ పోస్టును షేర్ చేశారు.

Gujarat : అతను హెల్మెట్ పెట్టుకోకపోయినా పోలీసులు జరిమానా విధించరు.. కారణం ఏంటో తెలుసా?

షహీనా అత్తర్వాలా మరో థ్రెడ్‌లో ‘పాశ్చాత్య దేశాల్లో పనిచేసేవారు నాలాగే ఒకే లైన్ లో నిలబడి కాఫీ తాగడం, అదే స్థలాన్ని పంచుకోవడం, పనివారిని గౌరవించడం చూసానని ఇక్కడ మాత్రమే ఇలా ఎందుకు ఉన్నారంటూ’ పోస్టు చేశారు. పనివారి పట్ల వివక్షను ప్రదర్శిస్తూ హౌసింగ్ సొసైటీ తీసుకున్న నిర్ణయంపై పలువురు విమర్శలు గుప్పించడంతో సోషల్ మీడియాలో ఈ ఘటనపై తీవ్ర చర్చ జరిగింది. కొందరు హౌసింగ్ సొసైటీ నిర్ణయాన్ని సమర్ధించారు. రెసిడెంట్ లిఫ్ట్‌లు చాలా బిజీగా ఉంటాయని, హెల్పర్స్ కోసం ప్రత్యేక లిఫ్ట్‌లు ఉన్నాయని వాదించారు. కాగా ఈ హౌసింగ్ సొసైటీ ఏ ఏరియాలో ఉందనే విషయం మాత్రం బయటకు రాలేదు.

ట్రెండింగ్ వార్తలు