Gujarat : యోగా చేసిన మహిళకు జరిమానా.. ఎందుకో తెలుసా!

ఎరుపు రంగు దుస్తుల్లో దినా పర్మార్ అనే మహిళ గుజరాత్ లో నడిరోడ్డుపై యోగా చేస్తుండగా వాహనాల రాకపోకలను అవాంతరం ఏర్పడింది. నగరంలోని ఓ బిజీ రోడ్ పై మహిళ యోగాసనాలు వేస్తుండగా పోలీసులు వీడియో తీశారు.

Gujarat : యోగా చేసిన మహిళకు జరిమానా.. ఎందుకో తెలుసా!

Gujarat Police Fined Yoga Woman

Updated On : October 11, 2023 / 12:55 PM IST

Gujarat Police Fined Yoga Woman : యోగా చేసిన మహిళకు గుజరాత్ పోలీసులు జరిమానా విధించారు. అదేంటీ యోగా చేస్తే జరిమానా విధిస్తారా అనుకుంటున్నారా.. నడిరోడ్డుపై యోగా చేస్తూ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించినందుకు జరిమానా విధించారు. ఎరుపు రంగు దుస్తుల్లో దినా పర్మార్ అనే మహిళ గుజరాత్ లో నడిరోడ్డుపై యోగా చేస్తుండగా వాహనాల రాకపోకలను అవాంతరం ఏర్పడింది.

నగరంలోని ఓ బిజీ రోడ్ పై మహిళ యోగాసనాలు వేస్తుండగా పోలీసులు వీడియో తీశారు. ఈ వీడియోను గుజరాత్ పోలీసులు ట్విట్టర్ లో షేర్ చేయగా వైరల్ అయింది. వర్షం కురుస్తుండగా రోడ్డు మధ్యలో మహిళ స్ప్లిట్ ను పర్ఫామ్ చేస్తుండటం ఈ క్లిప్ లో కనిపించింది. మహిళ చేష్టలతో పలు వాహనాలు పర్మార్ వెనుక ఆగిపోవాల్సి వచ్చింది.

Horse paintings : గుర్రాల పెయింటింగ్ ఇంట్లో ఉండొచ్చా..? అప్రమత్తంగా లేకుంటే ఆర్థిక కష్టాలే..!

ఆపై తన నిర్లక్ష్యపూరిత ప్రవర్తనకు పర్మార్ క్షమాపణలు చెప్పడం చూడొచ్చు. జరిమానా చెల్లించిన తర్వాత పర్మార్ ను అధికారులు విడుదల చేశారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, బహిరంగ ప్రదేశాలను దుర్వినియోగం చేయరాదని పోలీసులు విజప్తి చేశారు.