×
Ad

IBomma Ravi Arrest: ఆ ఒక్క మెయిల్ తో.. ఐబొమ్మ రవిని పట్టేశాం.. కీలక విషయాలు చెప్పిన పోలీసులు..

ఈజీ మనీ కోసం సినిమాలను పైరసీ చేశాడు. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా 20 కోట్ల వరకు సంపాదించాడు.

IBomma Ravi Arrest: ఐబొమ్మ పైరసీ, సైట్ నిర్వహణ, పైరసీ పిన్ కింగ్ రవిని హైదరాబాద్ ఎలా రప్పించారు, ఎలా పట్టుకున్నారు అనేదానిపై సైబర్ క్రైమ్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ మీడియాకు వివరాలు తెలియజేశారు. సినిమా పైరసీ ద్వారా రవి ఏ విధంగా డబ్బు సంపాదించాడు అనేదానిపై పోలీసులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. స్నేహితుడు నిఖిల్ ద్వారా రవిని ట్రాప్ చేశామని అడిషనల్ సీపీ శ్రీనివాస్ తెలిపారు. నిఖిల్ ఐబొమ్మ, బప్పమ్ పోస్టర్లను తయారు చేసే వాడని ఆయన వెల్లడించారు.

”గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ద్వారా రవి డబ్బు సంపాదించాడు. రవి భార్యను మేము సంప్రదించలేదు. రవి భార్య ఇచ్చిన సమాచారంతో అతడిని పట్టుకున్నాం అనేది అబద్ధం. మరికొన్ని పైరసీ వెబ్ సైట్లు నడుస్తూనే ఉన్నాయి. వాటి నిర్వాహకులను కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. రవి టీమ్ అంతా కరీబియన్ దీవుల్లో ఉంది. రవి సర్వర్లన్నీ నెదర్లాండ్స్ లో ఉన్నాయి. బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన డబ్బులు యాడ్ బుల్ కంపెనీకి తరలించాడు. ప్రతి వారం ఓ దేశానికి ప్రయాణించే వాడు. 80లక్షలు పెట్టి సెయింట్ కిట్స్ పౌరసత్వం కూడా కొన్నాడు.

రవికి కష్టపడి జాబ్ చేయాలన్న ఆలోచన లేదు. టెక్నాలజీ బాగా తెలుసు. ఈజీ మనీ కోసం సినిమాలను పైరసీ చేశాడు. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా 20 కోట్ల వరకు సంపాదించాడు. మూవీ రూల్జ్, తమిళ్ ఎంవీ లాంటి పలు పైరసీ సైట్ల నిర్వాహకులను కూడా పట్టుకుంటాం” అని సైబర్ క్రైమ్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ చెప్పారు.

”రవికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. గెట్టింగ్ అప్ అనే యాప్ ఉంది. హోస్టింగ్ సైట్ కి సంబంధించి సైబర్ ఇన్ స్పెక్టర్ ఒకసారి మెయిల్ పెట్టారు. ఇది ఎవరిది అని అడిగారు. ఆ మెయిల్ కి అతడే ఆన్సర్ ఇచ్చాడు. అప్పటివరకు మాకు ఐబొమ్మ రవిని అని తెలీదు. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని మమ్మల్ని అడిగాడు. దాంతో మాకు డౌట్ వచ్చింది. అక్కడి నుంచి మళ్లీ స్టార్ట్ అయ్యింది. రవి భార్య మాకు సమాచారం ఇచ్చింది అనేది పూర్తిగా అవాస్తవం. రవి భార్య కానీ రవి బంధువులు కానీ ఎవరూ మాకు కాంటాక్ట్ లో లేరు. రవి గురించి సమాచారం వేరే రకంగా వచ్చింది. నెల రోజుల నుంచి ఎంతో అనాలసిస్ చేసుకుంటూ వచ్చాం. నిజానికి రవి దొరుకుతాడని కూడా మాకు గ్యారెంటీ లేదు. డేటాను అనాలసిస్ చేసుకుంటూ చేసుకుంటూ పోతే ఒక వ్యక్తి దొరికాడు. అతడి నెంబర్ దొరికింది. దాని ద్వారా ముందుకెళితే.. రవి దొరికాడు” అని అడిషనల్ సీపీ శ్రీనివాస్ తెలిపారు.

Also Read: నిర్మాతకు వచ్చేది కేవలం 17 పైసలే.. అసలు పాప్ కార్న్ తో మాకు సంబంధమే లేదు.. SKN ట్వీట్ వైరల్..