అభయ హస్తం 6 గ్యారెంటీల దరఖాస్తులు ఎలా నింపాలి.. ఏయే పత్రాలు కావాలి?

తెలంగాణలో అభయ హస్తం 6 గ్యారెంటీలకు దరఖాస్తులు పెట్టుకునే వారు ఆధార్, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్.. పాస్‌పోర్ట్ సైజ్‌ ఫొటో తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలి.

How to Download and Fill the 6 Guarantees Praja Palana Application Form Step by Step Guide

Congress Prajapalana Telangana 2023: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలపై అమలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీయిచ్చిన హస్తం పార్టీ.. కార్యాచరణ ప్రకటించింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన సభలు నిర్వహించి 6 గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. దీనికి సంబంధించిన నమూనా దరఖాస్తులను రూపొంచింది.

అయితే 6 గ్యారెంటీలకు ఎవరు అర్హులు, దరఖాస్తుతో ఏయే పత్రాలను జత చేయాలనే దానిపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఇవ్వడంతో పాటు దరఖాస్తులో పేర్కొన్న వివరాలన్నీ వాస్తవమని ధ్రువీకరిస్తూ దరఖాస్తుదారులు పేరు రాసి సంతకం చేయాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత అధికారుల సంతకం, స్టాంప్ వేసిన రసీదు తీసుకుని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.

దరఖాస్తు ఎలా నింపాలి?
ముందుగా మొదటి పేజీలో దరఖాస్తు పేరు రాయాలి. తర్వాత లింగం, కులం, పుట్టిన తేదీ, ఆధార్ నంబరు, రేషన్ కార్డు నంబరు, ఫోన్ నంబరు, వృత్తి వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు(దరఖాస్తుదారులతో సంబంధం, లింగం, పుట్టినతేదీ, ఆధార్ నంబరు) పొందుపరచాలి. ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వారి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో కూడా అతికించాలి.

రసీదు మర్చిపోవద్దు
రెండో పేజీలో ముందుగా చిరునామా వివరాలు నింపాల్సివుంటుంది. తర్వాత అభయ హస్తం గ్యారెంటీ పథకాలు పొందడానికి వివరాలు ఉంటాయి. దరఖాస్తుదారులు వీటిలో తాము ఏయే పథకాలకు అర్హులమో చూసుకుని వాటికి మాత్రమే వివరాలు ఇవ్వాలి. దరఖాస్తు మొత్తం 4 పేజీల్లో ఉంటుంది. చివరిలో ప్రజా పాలన దరఖాస్తు రసీదు ఉంటుంది. దరఖాస్తు పూర్తిచేసిన ఇచ్చిన తర్వాత మర్చిపోకుండా అధికారుల సంతకంతో కూడిన రసీదు తీసుకోవాలి.

అభయ హస్తం 6 గ్యారెంటీల దరఖాస్తులు ఇక్కడి నుంచి Download చేసుకోండి

Congress Praja Palana Application page 1

Congress Praja Palana Application page 2

Congress Praja Palana Application page 3

Congress Praja Palana Application page 4

ట్రెండింగ్ వార్తలు