Lenskart Investments : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. హైదరాబాద్ లో రూ.1500 కోట్లతో లెన్స్ కార్ట్ ప్లాంట్..

ఇక ఏరో స్పేస్ డిఫెన్స్ కు సంబంధించిన 4 సంస్థలు తెలంగాణ సర్కార్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

Lenskart Investments : తెలంగాణ సర్కార్ తో పలు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. పార్క్ హయత్ లో ఐటీ శాఖ ప్రజాపాలన వియయోత్సవాల్లో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో 6 కంపెనీలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి. లెన్స్ కార్ట్ సంస్థ హైదరాబాద్ లో 1500 కోట్లతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించనుంది.

సన్ గ్లాసెన్, కూలింగ్ గ్లాసెస్, ఐ వేర్ ప్రొడక్ట్స్ కు సంబంధించి దేశంలోనే అతి పెద్ద మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని స్థాపించనున్న లెన్స్ కార్ట్.. ప్రత్యేక్షంగా 1600 మంది ఉపాధి కల్పించనుంది. ఇక ఏరో స్పేస్ డిఫెన్స్ కు సంబంధించిన 4 సంస్థలు తెలంగాణ సర్కార్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సంస్థలన్నీ మూడు నెలల్లోపే ప్లాంట్లను ప్రారంభించి వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.

 

Also Read : తెలంగాణ తల్లి రూపంపై అనవసర రాద్ధాంతం వద్దు- శిల్పి రమణారెడ్డి