Telangana Thalli Statue : తెలంగాణ తల్లి రూపంపై అనవసర రాద్ధాంతం వద్దు- శిల్పి రమణారెడ్డి
భావి తరాలకు అభయం ఇచ్చేలా తెలంగాణ తల్లి రూపం ఉండాలని శిల్పి రమణారెడ్డి అన్నారు.

Telangana Thalli Statue : తెలంగాణ తల్లి రూపంపై అనవసర రాద్ధాంతం వద్దని.. తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త, శిల్పి రమణారెడ్డి అన్నారు. ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధించుకున్నామని, ఇది తెలంగాణ తల్లి రూపంలో ప్రతిబింబించాలని ఆయన చెప్పారు. తెలంగాణ తల్లి రూపంలో అవన్నీ ఉన్నాయని శిల్పి రమణారెడ్డి వెల్లడించారు. గతంలో ఉన్న తెలంగాణ తల్లికి కిరీటాలు ఉన్నాయని, వాస్తవానికి కిరీటాలు దేవతలకు ఉంటాయని పేర్కొన్నారు. మన తల్లిలా, ఉద్యమ స్ఫూర్తిని చాటేలా తెలంగాణ తల్లి రూపం ఉందన్నారు. గుడిలో దేవతామూర్తిలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండొద్దని శిల్పి రమణారెడ్డి వెల్లడించారు. భావి తరాలకు అభయం ఇచ్చేలా తెలంగాణ తల్లి రూపం ఉండాలని శిల్పి రమణారెడ్డి అన్నారు.
తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అంతా సిద్ధమైంది. సచివాలయంలో ప్రధాన ద్వారం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
”తెలంగాణ అమర జ్యోతితో పాటు నూతన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉంది. దీని రూపకర్త ప్రొఫెసర్ గంగాధర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, సూచనలు మేరకు విగ్రహాన్ని రూపుదిద్దడం జరిగింది. దాన్ని నేను శిల్పాకృతికి మలచడం జరిగింది. సీఎం రేవంత్ స్వయాన కళాకారుడు. ఆయనకు మంచి అవగాహన ఉంది కళపైన. ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణ కాబట్టి.. ప్రజలు, బహుజనుల ఇన్వాల్వ్ మెంట్ ప్రతిబింబించేలా విగ్రహం కనిపించాలన్నారు. ఒక సామాన్య స్త్రీ ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన.
దేవతా మూర్తులకు కిరీటాలు, ఆర్బాటాలు ఉంటాయి. అది గుడిలో పెట్టుకుని పూజించాల్సిన ఆకారం. అదే సమయంలో తెలంగాణ తల్లి అనేది మన ఇంట్లో డైలీ చేసేది. మన ఓన్ చేసుకునే క్యారెక్టర్. తెలంగాణకు గొప్ప చరిత్ర ఉంది. ఉద్యమాల ద్వారా సాధించుకున్న రాష్ట్రం. కాబట్టి చాలా అరుదుగా శిల్పాకృతికి గంగాధర్ డిజైన్ చేయడం జరిగింది. అందులో పీఠ భాగం ఉంటుంది. 17 ఫీట్ల కాంస్య విగ్రహం ఉంటుంది. కింద మూడు ఫీట్ల పీఠం ఉంటుంది. అందులో వందలాది ఉద్యమిస్తున్నటువంటి పిడికిళ్లు కనిపిస్తాయి.
తొలి, మలి దశ ద్వారా ఎందరో త్యాగాల ద్వారా తెలంగాణను సాధించుకున్నాం అనేది తెలిపేలా సింబాలిక్ గా పిడికళ్లను ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత చేతులు తెలంగాణ తల్లిని పైకి ఎత్తుతూ ఉంటుంది. తెలంగాణ తల్లి ఒక సాంప్రదాయకమైన, మూమూలు తల్లి, మన ఇంట్లో ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తిలా ఉండాలన్నది సీఎం రేవంత్ రెడ్డి సూచన” అని శిల్పి రమణారెడ్డి తెలిపారు.
Also Read : కేసీఆర్ నిజంగా తెలంగాణ ఉద్యమకారుడైతే ఇక్కడకు రావాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి