Komatireddy Venkat Reddy: కేసీఆర్ నిజంగా తెలంగాణ ఉద్యమకారుడైతే ఇక్కడకు రావాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కార్యక్రమానికి వచ్చి కేసీఆర్ గౌరవం పెంచుకోవాలని అన్నారు. కేసీఆర్ ను మంత్రిగా తాను ఆహ్వానిస్తున్నానని తెలిపారు.

Minister Komatireddy Venkat Reddy
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా తెలంగాణ ఉద్యమకారుడైతే.. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇవాళ 10టీవీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ అమరులకు నివాళి అర్పించి.. తెలంగాణ తల్లిని దర్శించుకోవాలని చెప్పారు.
కార్యక్రమానికి వచ్చి కేసీఆర్ గౌరవం పెంచుకోవాలని అన్నారు. కేసీఆర్ ను మంత్రిగా తాను ఆహ్వానిస్తున్నానని తెలిపారు. విగ్రహావిష్కరణకు రాకపోతే చరిత్ర హీనులు అవుతారని చెప్పారు. నాడు తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్నానని, ఇప్పుడు తెలంగాణ తల్లిని ఆవిష్కరించుంటుకున్నానని చెప్పుకొచ్చారు. తనకు చాలా గర్వంగా, ఆనందంగా ఉందని.. ప్రజాపాలనలో నిత్యం ప్రజల్లో పనిచేస్తున్నామని తెలిపారు.
కేసీఆర్.. పదేళ్లు పదిసార్లు కూడా సెక్రటేరియట్ రాలేదని చెప్పారు. తమ సీఎం ఏడాదిలో పదిసార్లు కూడా సెక్రటేరియట్ కు ఆప్సెంట్ కాలేదని తెలిపారు. లక్ష హామీలిచ్చి, దొంగ దీక్షలు చేసిన చరిత్ర కేసీఆర్ ది అని అన్నారు. హరీశ్ రావు.. కేటీఆర్.. మామ చాటు, తండ్రి చాటు ఎమ్మెల్యేలని చెప్పారు. వాళ్లు ప్రస్టేషన్ లో ఉన్నారని, వారిని సీరియస్ గా తీసుకోవడం లేదని చెప్పారు. తాము నిత్యం ప్రజల్లో ఉన్నవాళ్లమని అన్నారు.