Huzurabad By Poll : టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తేలిపోయింది. అందరూ ఊహించనట్టే...ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర‌ అధ్య‌క్షుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈమేరకు 2021, ఆగస్టు 11వ తేదీ బుధవారం ఉదయం ప్రకటన చేశారు.

Huzurabad Trs

Gellu Srinivas : హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తేలిపోయింది. అందరూ ఊహించనట్టే…ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర‌ అధ్య‌క్షుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈమేరకు 2021, ఆగస్టు 11వ తేదీ బుధవారం ఉదయం ప్రకటన చేశారు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించగానే..గెల్లు శ్రీనివాస్ కు అభినందనలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలు ఇస్తూ..శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

Read More : Quan Hongchan : అమ్మ కోసం..14 ఏళ్లకే ఒలింపిక్స్‌లో పసిడి పతకాన్ని సాధించిన చిన్నారి

కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ అయ్యాక ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఈటలకు ధీటైన అభ్యర్థి కోసం విస్తృతంగా గులాబీ నాయకత్వం అన్వేషించిన తరుణంలో…పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, స్వర్గం రవి, వీరేశం, వకుళాభరణం కృష్ణమోహన్‌తో పాటు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డి పేరు కూడా వినిపించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా కౌశిక్‌రెడ్డికి గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదించారు కేసీఆర్‌.

Read More : Samsung Galaxy : శాంసంగ్ బిగ్ ఈవెంట్.. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌, వాచ్, ఇయర్​బడ్స్​ లాంచ్ నేడే!

మిగతావారిలో గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ వైపే గులాబీ దళపతి మొగ్గుచూపారు. బీసీ నేతగా ఈటల రాజేందర్‌ ప్రజల్లోకి వెళ్తుండడంతో ఆయనకు చెక్‌ పెట్టేందుకు బీసీ నేత గెల్లును ప్రయోగించాలని టీఆర్‌ఎస్‌ చూస్తోంది. ఉద్యమం సమయం నుంచే టీఆర్‌ఎస్‌వీలో క్రియాశీలకంగా వ్యవహరించిన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ది హుజూరాబాద్‌ నియోజకవర్గం కావడం ఒక ప్లస్‌ పాయింట్ అయితే ఉన్నత విద్యావంతుడు కావడంతో మరో అర్హతగా మారింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో..విద్యార్థి దశ నుంచే బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ గుర్తింపు దక్కించుకున్నారు గెల్లు శ్రీనివాస్‌. తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్‌ఎస్‌వి తరపున ఉద్యమానికి నాయకత్వం వహించారు.