Huzurabad By Poll 2021 : ప్రారంభమైన హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.  ముందుగా ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించారు.

Huzurabad By Election 2021:  కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.  ముందుగా ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాత్రి 7 గంటల వరకు కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూన్ 12న మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయటంతో హుజూరాబాద్ లో బై పోల్‌ జరగుతోంది.

ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో  ఉన్నారు. మొత్తం 17 వందల 15 మంది సిబ్బంది బైపోల్‌ డ్యూటీలో పాల్గొంటున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2 లక్షల 37 వేల 36 ఓటర్లు. ఇందులో పురుషులు 1 లక్షా 17 వేల 933 కాగా. లక్షా 19 వేల 102 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 14 మంది ఎన్.ఆర్. ఐ ఓటర్లు ఉన్నారు. మహిళ ఓటర్లు నేతల భవితవ్యం తేల్చనున్నారు. 306 పోలింగ్ కేంద్రాల్లో 306 కంట్రోల్ యూనిట్స్ తో పాటుగా 612 బ్యాలెట్ యూనిట్స్, 306 వివి ప్యాట్లు ఏర్పాటు చేశారు.

Also Read : By Poll : హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నిక..రెడీ టు పోల్

హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 306 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో రెండు చొప్పున మొత్తం 612 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేశారు. వీవీ ప్యాట్‌లు 306 ఉంటాయి. రిగ్గింగ్‌, దొంగ ఓట్ల నివారణకు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌ టెలికాస్టింగ్ సదుపాయం కల్పించారు. ఉప ఎన్నిక సందర్భంగా.. హుజూరాబాద్ నియోజకవర్గంలో 144సెక్షన్‌ అమల్లో ఉంది.

మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఉప ఎన్నికలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూసేందుకు 20 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి. బందోబస్తులో 2,245 మంది పోలీసులు నిమగ్నమయ్యారు.  నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అభ్యర్థుల భవితవ్యన్ని డిసైడ్ చేయనున్న 2,37,022 మంది ఓటర్లు. హుజురాబాద్ నియోజకవర్గ నికి ఇది మూడో ఉప ఎన్నిక.

ట్రెండింగ్ వార్తలు