By Poll : హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నిక..రెడీ టు పోల్

హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికకు అధికారులు సిద్ధం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 306 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. బద్వేల్‌లో 281 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు.

By Poll : హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నిక..రెడీ టు పోల్

Ap And Tg

Bypoll Huzurabad And Badvel : తెలుగు రాష్ట్రాల్లోని హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికకు అధికారులు సిద్ధం చేశారు. 2019 ఎన్నికల్లో బద్వేల్ నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. జూన్ 12న మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ లో బై పోల్‌ జరుగనుంది. చనిపోయిన ఫ్యామిలీకి ఈ ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంతో చనిపోయిన వారి జ్ఞాపకార్థం టీడీపీ, జనసేనలు బద్వేల్ లో పోటీ చెయ్యట్లేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు పోటీలో నిల్చున్నారు. బద్వేల్ లో అధికారపక్ష పార్టీ వైసీపీ అభ్యర్థిగా మరణించిన వెంకటసుబ్బయ్య భార్య సుధను బరిలో దింపింది. ఇక హుజూరాబాద్ విషయానికి వస్తే..ఇక్కడ ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ బరిలో ఉన్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్లు : –
హుజూరాబాద్‌ ఉపఎన్నిక కోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈవీఎంలతో పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది తరలివెళ్లనున్నారు.  మొత్తం 17 వందల 15 మంది సిబ్బంది బైపోల్‌ డ్యూటీలో పాల్గొననున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2 లక్షల 37 వేల 36 ఓటర్లు. ఇందులో పురుషులు 1 లక్షా 17 వేల 933 కాగా. లక్షా 19 వేల 102 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 14 మంది ఎన్.ఆర్. ఐ ఓటర్లు ఉన్నారు. మహిళ ఓటర్లు నేతల భవితవ్యం తేల్చనున్నారు. 306 పోలింగ్ కేంద్రాల్లో 306 కంట్రోల్ యూనిట్స్ తో పాటుగా 612 బ్యాలెట్ యూనిట్స్, 306 వివి ప్యాట్లు ఏర్పాటు చేశారు.

306 పోలింగ్ కేంద్రాలు : –
హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 306 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో రెండు చొప్పున మొత్తం 612 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేశారు. వీవీ ప్యాట్‌లు 306 ఉంటాయి. రిగ్గింగ్‌, దొంగ ఓట్ల నివారణకు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌ టెలికాస్టింగ్ సదుపాయం కల్పించారు. ఉప ఎన్నిక సందర్భంగా.. హుజూరాబాద్ నియోజకవర్గంలో 144సెక్షన్‌ అమల్లో ఉంది. మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఉప ఎన్నికలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూసేందుకు 20 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి. బందోబస్తులో 2,245 మంది పోలీసులు నిమగ్నమయ్యారు.

కడప జిల్లా బద్వేల్ :-
కడప జిల్లా బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి శనివారం పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బద్వేల్‌లో మొత్తం 281 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసింది ఈసీ. ఇందులో 221 సమస్యాత్మక కేంద్రాలున్నాయి. సమస్యాత్మక కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మైక్రో అబ్జర్వర్లను నియమించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలోనూ.. లైవ్ వెబ్‌ టెలికాస్టింగ్‌ ఉంటుంది. బద్వేల్‌ బై పోల్‌ డ్యూటీలో మొత్తం 11 వందల 24 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటున్నారు. భారీ వర్షం కురుస్తుండండంతో ఎన్నికల ఏర్పాట్లకు అంతరాయం కలుగుతోంది. ఎన్నికల సిబ్బందిని తరలించే బస్సులు మొరాయించాయి. వర్షం కురవడంతో బ్యాటరీ డౌన్‌ అయిన బస్సులను సిబ్బంది నెట్టాల్సి వచ్చింది. బురదలో చిక్కుకొన్న కొన్ని బస్సులను జేసీబీ సాయంతో లాగించాల్సి వచ్చింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామాగ్రి తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

7 గంటల నుంచి పోలింగ్ : –
శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 306 పోలింగ్ కేంద్రాల్లో 1715 పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 2 లక్షల 37 వేల 36 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రానికి 500 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ విధించనున్నారు. ఉప ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. లాడ్జీలు, నియోజకవర్గంలో 21 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, ముమ్మర తనిఖీలు చేపట్టారు. నియోజకవర్గం పరిధిలో 15 ప్లటూన్ల పారా మిలిటరీ బలగాలను రంగంలోకి దింపారు. మొత్తం 2 వేల మందితో ఎన్నికల బందోబస్తు ఏర్పాటు చేశారు.