Etala Challenges : హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా

ఈటల మరోసారి టీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే..నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానంటూ ఈటల టీఆర్ఎస్ ఓడితే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలి అంటూ..

etala rajender challenges TRS party and cm kcr : టీఆర్ఎస్ పార్టీ నేతలపై ఈటల విరుచుకుపడుతున్నారు.పార్టీని వీడి బీజేపీలో చేరిన ఈటల గులాబీ బాస్ పై కూడా పలుమార్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈటలపై కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు అంతకంటే ఘాటు విమర్శలతో దాడి చేస్తున్నారు. కానీ ఈటల కూడా ఏమాత్రం తగ్గేది లేదన్నట్లుగా వారి మాటలకు కౌంటర్లు ఇస్తునే ఉన్నారు. ఈక్రమంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి టీఆర్ఎస్ పార్టీ నేతలకే కాదు ఏకంగా సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. ‘‘హుజూరాబాద్ లో ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే నేను శాశ్వతం గా రాజకీయాల నుండి తప్పుకుంటానని మరి టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలి అంటూ సవాల్ విసిరారు.

హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ విజయం కోసం విస్తృతంగా ప్రచారంతో కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావును లక్ష్యంగా పలు ఘాటు విమర్శలు చేస్తున్నారు ఈటల. ఇక టీఆర్ఎస్ గెలుపు బాధ్యతను హరీశ్ రావు తీసుకున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక గెలుపు కోసం అటు ఈటల..ఇటు టీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఈక్రమంలో మాటల తూటాలు పేలుతున్నాయి. దీంట్లో భాగంగా టీఆర్ఎస్ నేతలు ఈటలతోపాటు బీజేపీ పార్టీపైనే కాకుండా కేంద్రంపై కూడా పలు విమర్శలు పైనా ఆయన విమర్శల దాడికి దిగుతున్నారు.

ఈ క్రమంలో ఈటల, హరీశ్ రావు తమ విమర్శలను కొనసాగిస్తునే ఉన్నారు. ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకున్నారు. తాజాగా..ఈటల రాజేందర్ మరోసారి టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. ఒకవేళ టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ రాజీనామా చేస్తారా? అంటూ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. తాను హుజూరాబాద్‌లో అభివృద్ధి చేయలేదని హరీశ్ రావు అనటం సిగ్గుచేటని అన్నారు. పోలీసుల్ని..అధికారుల్ని, డబ్బులతో ఓట్లను కొనటం ఆపి..అప్పుడు ప్రచారం చెయ్యి నువ్వు గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా. నువ్వు తప్పుకుంటావా? ఆ దమ్ముందా?’ అంటూ ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలాగే కేసీఆర్ పై కూడా ఈటల విమర్శనాస్త్రాలు సంధించారు. హుజూరాబాద్ లో నా గెలుపు ఖాయం అని..ఇక నీ మోసాలు చెల్లవని అన్నారు. ప్రజలు కేసీఆర్‌‌ను నమ్మడం మానేసి చాలా రోజులైందని ఈ విషయం టీఆర్ఎస్ గుర్తించలేని దశలో ఉందని అన్నారు. తనను గెలిపించి.. కేసీఆర్ అహంకారాన్ని అణచివేయాలని ఈటల ప్రజలను కోరారు. మీ మామ కోసం ఆయన ఆదేశాలు పాటిస్తూ నా గొంతు నొక్కాలని అనుకుంటున్నావు హరీశ్ రావు..కానీ ఏదోక రోజు ప్రజలే నీ గొంతు నొక్కుతారని గుర్తుంచుకోమంటూ హరీష్ రావుపై మండిపడ్డారు ఈటల.హరీష్ రావు పచ్చి అబద్ధాలు హుజూరాబాద్ లో ప్రచారం చేస్తున్నారనీ..ఈటల తన మాటలతో టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు