హైదరాబాద్ నగరంలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు పెరుగుతున్నాయి. పలుసార్లు డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారి తీరు మారడం లేదని అడిషనల్ సీపీ (ట్రాఫిక్) విశ్వ ప్రసాద్ తెలిపారు. కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నారని చెప్పారు.
వీకెండ్ రోజుల్లో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత రాత్రి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ ఏర్పాటు చేశామని అన్నారు. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ లోని పబ్బులు, రెస్టారెంట్లు, బార్లలో ఎస్టాబ్లిష్మెంట్ పార్కింగ్ లేకుండా వాలెట్ పార్కింగ్ పేరుతో రోడ్లమీద కస్టమర్ల వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని తెలిపారు.
రాంగ్ పార్కింగ్ మీద డ్రైవ్ చేశామని, సుమారుగా 50 నుంచి 100 వాహనాలకు లాక్ వేశామని చెప్పారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు 10 తర్వాతే సిటీలోకి అనుమతి ఉంటుందని అన్నారు. ప్రయాణికులు ఎక్కించుకునేందుకు సిటీలో కొన్ని హాల్టింగ్ పాయింట్స్ పెట్టుకున్నారని, కొన్నిచోట్ల వరుసగా వాహనాలు రావడంతో సిటీలో రాత్రుళ్లు ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని తెలిపారు.
రానున్న రోజుల్లో బస్సు ట్రావెల్స్ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు యాజమాన్యాలతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉదయం వేళలో కూడా ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని తెలిపారు. వితౌట్ హెల్మెట్, రాంగ్ డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టామని చెప్పారు. వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని అన్నారు.
10టీవీతో హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెడ్డె మాట్లాడుతూ.. నగరంలో రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అయ్యాయని చెప్పారు. కొందరు మద్యం ముత్తులో ప్రమాదాలు చేస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో 8 పాయింట్స్ వద్ద స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించామని తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ లతో పాటు రాంగ్ పార్కింగ్ పై ఫోకస్ పెట్టామని చెప్పారు. కస్టమర్లు కూడా హోటల్స్ కు వచ్చేముందు సరైన పార్కింగ్ ఉందో లేదో చూసుకోవాలని అన్నారు.
ట్రంప్ రెడ్ బుక్ రెడీ..! కెనడా ప్రధాని ట్రూడోకు కఠినమైన సవాళ్లు తప్పవా?