ట్రంప్ రెడ్ బుక్ రెడీ..! కెనడా ప్రధాని ట్రూడోకు కఠినమైన సవాళ్లు తప్పవా?
రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు.. న్యాయ వ్యవస్థ సభ్యులు, ఫెడరల్ ఏజెన్సీలు కూడా ట్రంప్ శత్రువుల లిస్టులో ఉన్నాయి.

Donald Trumps Red Book : ఇంటి శత్రువుల సంగతి సరే. ట్రంప్ రెడ్ బుక్ లో తెలియకుండా చేరిన మరో పేరు ట్రూడో. అమెరికా రాజకీయ నేతలు, అధికారులతో కంపేర్ చేస్తే ట్రంప్ దెబ్బ ట్రూడోకు మరింత గట్టిగా తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ట్రంప్ విజయానికి, ట్రూడో నష్టానికి సంబంధం ఏంటి? ట్రూడో అంటేనే కస్సుమనే ట్రంప్.. అతడిని పరోక్షంగా ఎలా దెబ్బతీయబోతున్నారు? ట్రూడోకు ఎందుకు కష్టాలు ఎక్కువ కాబోతున్నాయి?
కెనడా ప్రధాని ట్రూడో భారత్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు.. ఓవరాక్షన్ స్టార్ అయిపోయాడు. నిజ్జర్ హత్య ఘటనలో ఇండియాను ఇరికించే ప్రయత్నం చేస్తూ బొక్కబోర్లా పడుతున్నాడు. కెనడా మరో పాకిస్తాన్ లా అనిపిస్తోంది అంటే.. అది కేవలం ట్రూడో వల్లే. అయితే, ట్రంప్ శత్రువుల జాబితాలో ట్రూడో కూడా చేరిపోయినట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజానికి ట్రంప్ మీద, ఆయన విధానాల మీద ట్రూడో చాలాసార్లు విమర్శలు గుప్పించాడు. దీంతో ట్రంప్ శత్రువుల లిస్ట్ లో ట్రూడో చేరిపోయాడు.
ట్రంప్, ట్రూడో మధ్య ఉప్పు నిప్పు అన్న పరిస్థితులు కనిపిస్తుంటాయి ప్రతీసారి. అయితే, ట్రంప్ ఇలా విజయం సాధించారో లేదో అందరికంటే ముందు విషెస్ చెప్పింది ట్రూడోనే. రెండు దేశాల మధ్య స్నేహం కొనసాగుతుందని, సరికొత్త అవకాశాలు క్రియేట్ చేసుకుందాం అంటూ ట్రంప్ కు విషెస్ చెప్పారు ట్రూడో. కాకా పట్టే ప్రయత్నం చేసినా అది వర్కౌట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పైగా ట్రూడోకు మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్నికల్లో ప్రచారం చేసినట్లు.. ఇంటర్వ్యూల్లో పదే పదే ఆయన చెప్పినట్లు.. ప్రతీకారం కోసం ట్రంప్ ఎదురు చూస్తున్నాడని క్లియర్ గా అర్థమవుతోంది. ట్రంప్ అన్నంత పని చేస్తారా? రివెంజ్ ఏ రేంజ్ లో ఉండబోతోంది? దేశ అధ్యక్షుడి హోదాలో ఉండి ప్రతీకారం తీర్చుకోవడం సాధ్యమేనా? ట్రంప్ పాలన ఎలా ఉండే ఛాన్స్ ఉంది?
రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు.. న్యాయ వ్యవస్థ సభ్యులు, ఫెడరల్ ఏజెన్సీలు కూడా ట్రంప్ శత్రువుల లిస్టులో ఉన్నాయి. వీరందరి మీద ట్రంప్ ప్రతీకారం తీర్చుకుంటారా అనే ప్రచారం జరుగుతోంది. నిజానికి ఎన్నికల్లో వార్నింగ్ లతో పాటు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ పేరుతో ట్రంప్ చాలానే హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయడంలో అసలైన సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కచ్చితంగా ఉంటాయి. అయితే, తనను అవమానించిన వారిలో కొందరిని, తప్పు చేశారని భావిస్తున్న వారిలో మరికొందరిపై ట్రంప్ చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి తప్ప శత్రువుల లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Also Read : ట్రంప్ వచ్చాడు.. యుద్ధాలు ఆపేస్తాడా? అసలు యుద్ధాలు ఆపడం ఆయనకు సాధ్యమేనా?