Hyderabad : హైదరాబాద్‌లో వాహనదారులకు అలర్ట్.. ఈ ప్రాంతాల వైపు వెళ్లకండి.. సెప్టెంబర్ 5వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలివే..

Hyderabad : నగరంలో పలు ప్రాంతాల నుంచి వచ్చే వరుస గణనాథుల నిమజ్జనాలను పురస్కరించుకొని సెప్టెంబర్ 5వ తేదీ వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ..

Hyderabad

Hyderabad : హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. నగరంలోని వాడవాడలా గణపయ్యలను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే, నగరంలోని ఖైరతాబాద్ మహాగణపతికి దేశంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి గణనాథుడ్ని దర్శించుకునేందుకు (Hyderabad) నగరం నుంచేకాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అదేవిధంగా గణేశ్ నిమజ్జనాల సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Also Read: Hyderabad : హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మూడ్రోజులు అప్రమత్తంగా ఉండండి..

నగరంలో పలు ప్రాంతాల నుంచి వచ్చే వరుస గణనాథుల నిమజ్జనాలను పురస్కరించుకొని ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా రోజుల్లో నిమజ్జనానికి వచ్చే విగ్రహాలను బట్టి ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్ లలో మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.

 

ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

♦ కర్బలా మైదాన్ నుండి వచ్చే సాధారణ ట్రాఫిక్ అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించబడదు. సెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ క్రాస్ రోడ్స్ వైపు మళ్లించబడుతుంది.
♦ లిబర్టీ లేదా ఖైరతాబాద్ వైపు వెళ్లాలనుకునే వారు కవాడిగూడ క్రాస్ రోడ్లు, డీబీఆర్ మిల్స్, వార్తా లేన్, స్విమ్మింగ్ పూల్, బండ మైసమ్మ, ధర్నా చౌక్, ఇందిరా పార్క్ ఎక్స్ రోడ్, ఆర్కే మఠం, కట్టమైసమ్మ జంక్షన్, అంబేద్కర్ విగ్రహం లేదా తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఇక్బాల్ మినార్ మీదుగా వెళ్ళవచ్చు.
♦ ట్యాంక్‌బండ్ మీదుగా పంజాగుట్ట వైపు వెళ్లాలనుకునే వాహనదారులు రాణిగంజ్, మినిస్టర్ రోడ్, బేగంపేట, పంజాగుట్ట మీదుగా వెళ్లవచ్చు.
♦ పంజాగుట్ట, రాజ్ భవన్ నుండి ఎన్టీఆర్ మార్గ్, పీబీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ను ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై అనుమతించరు. నిరంకారి, ఓల్డ్ పీఎస్ సైఫాబాద్ మరియు ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
♦ అంబేద్కర్ విగ్రహం నుండి వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించరు. ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
♦ ఇక్బాల్ మినార్ నుండి సికింద్రాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లించి కట్ట మైసమ్మ ఆలయం, డిబిఆర్ మిల్స్, కవాడిగూడ ఎక్స్ రోడ్ వైపు వెళ్తారు.
♦ కట్ట మైసమ్మ ఆలయం నుండి ధోబీ ఘాట్ మీదుగా వచ్చే సాధారణ ట్రాఫిక్ ఎగువ ట్యాంక్‌బండ్ వద్ద అనుమతించబడదు. DBR మిల్స్ వద్ద కవాడిగూడ X రోడ్ వైపు మళ్లించబడుతుంది.
♦ ముషీరాబాద్/జబ్బార్ కాంప్లెక్స్ నుండి వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను సెయిలింగ్ క్లబ్ వైపు అనుమతించరు. కవాడిగూడ ఎక్స్ రోడ్ వద్ద డిబిఆర్ మిల్స్ వైపు మళ్లిస్తారు.
♦ మినిస్టర్ రోడ్ నుండి వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను పి.వి.ఎన్.ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) వైపు అనుమతించరు. నల్లగుట్ట వంతెన వద్ద కర్బాలా వైపు మళ్లిస్తారు.
♦ బుద్ధ భవన్ నుండి వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను పి.వి.ఎన్.ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) వైపు అనుమతించరు. నల్లగుట్ట ఎక్స్ రోడ్ల వద్ద మినిస్టర్ రోడ్ వైపు మళ్లిస్తారు.


పైన పేర్కొన్న ట్రాఫిక్ ఆంక్షలు NTR మార్గ్, పీపుల్స్ ప్లాజా, P.V.N.R మార్గ్ (నెక్లెస్ రోడ్) వద్ద గణేశ్ విగ్రహాలను నిమజ్జనం సందర్భంగా రద్దీని బట్టి ట్రాఫిక్ ఆంక్షలు విధించబడతాయని తెలియజేశారు. ఆయా ప్రాంతాల మీదుగా తమ గమ్య స్థానాలకు చేరుకునే నగరవాసులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకొని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.