Hyderabad Covid : కోవిడ్ టెస్టులు..ఇండియాలో హైదరాబాద్ థర్డ్ ప్లేస్
హైదరాబాద్ లో పాజిటివిటీ రేటు 0.12 శాతంగా ఉంది. హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం...

Hyd Covid
India Covid : రాబోయే రోజుల్లో.. కరోనా కేసులు పెరుగుతాయన్న భయాలు.. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉంటుందనే అంచనాలు న్నాయి. ఈ క్రమంలో…గత ఆరు నెలలుగా దేశంలో నిర్వహిస్తున్న కోవిడ్ టెస్టుల్లో.. హైదరాబాద్ జిల్లా ఇండియాలోనే 3వ స్థానంలో నిలిచింది. 6 నెలలుగా.. దేశవ్యాప్తంగా 7 వందల జిల్లాల్లో కరోనా టెస్టుల లెక్కలను తీశారు. హైదరాబాద్ లో ప్రతి నెలా సగటున 2 లక్షల 57 వేలకు పైగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇక.. ఈ విషయంలో.. నెలకు 15 లక్షల టెస్టులు నిర్వహిస్తూ బెంగళూరు అర్బన్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో.. 3 లక్షల 39 వేల టెస్టులతో త్రిస్సూర్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. సూరత్ 4, పాట్నా 5 వ స్థానాల్లో ఉన్నాయి.
Read More : Miss Universe 2021 : విశ్వసుందరి హర్నాజ్ కౌర్ సంధు..ఈమె ఎవరు ?
గత 6 నెలల్లో.. తెలంగాణ వ్యాప్తంగా 99 లక్షలకు పైనే కోవిడ్ టెస్టులు నిర్వహించారు. జూన్ నుంచి నవంబర్ మధ్యలో.. 15 లక్షల 47 వేల టెస్టులు.. ఒక్క హైదరాబాద్‌లోనే చేశారు. అలాగే.. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ.. ప్రతి నెలా కరోనా పరీక్షలు భారీగానే చేస్తున్నారు. ప్రతి జిల్లాలో.. సగటున 60 వేల కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. వరంగల్ అర్బన్, కరీంనగర్‌లో నెలకు.. సగటున లక్ష టెస్టులు జరుపుతున్నారు. ఖమ్మంలో యావరేజ్‌గా 86 వేల 820, రంగారెడ్డిలో 85 వేల 6 వందలు, సిద్దిపేటలో 85 వేలు, మంచిర్యాలలో 79 వేల 5 వందలు, మెదక్ లో 77 వేల 4 వందలు, భద్రాద్రి కొత్తగూడెంలో దాదాపు 65 వేలు, పెద్దపల్లిలో 63 వేల 727 టెస్టులు జరుపుతున్నారు..
Read More : Hyderabad Crime : నగరంలో నయామోసం.. నకిలీ డీఎస్పీని అడ్డుపెట్టి రూ.1.2 కోట్లు దోచేశారు
ఇదిలా ఉంటే….10 శాతం పాజిటివిటీ రేటు దాటిన జిల్లాల్లో.. నైట్ కర్ఫ్యూలు విధించాలని.. కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించింది. లక్షల్లో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నప్పటికీ.. హైదరాబాద్ లో కోవిడ్ పాజిటివ్ రేటు చాలా తక్కువగా ఉంది. ఇది.. వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో సూచిస్తోంది. ప్రస్తుతానికి.. హైదరాబాద్ లో పాజిటివిటీ రేటు 0.12 శాతంగా ఉంది. హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం.. పాజిటివిటీ రేటు ఒక శాతం కన్నా తక్కువగా ఉంటే.. వైరస్ వ్యాప్తి చెందే రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ.. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, తరచుగా చేతులు శుభ్రపరుచుకోవడం లాంటివి మానొద్దంటున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. వైరస్ సోకే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్‌కి ముందు కూడా.. జనం అజాగ్రత్తగా ఉండటం వల్లే వైరస్ వ్యాప్తి చెందిందని గుర్తు చేస్తున్నారు.