Hyderabad liquor shops to be closed on 23rd april due to hanuman jayanti
Hyderabad liquor shops : మందుబాబులకు షాకింగ్ న్యూస్ ఇది. ఏప్రిల్ 23 మంగళవారం రోజున హైదరాబాద్ నగర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంగళవారం హనుమాన్ జయంతి కావడంతో నగరంలో ఉన్న వైన్‌షాపులు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
హిందువులు హనుమాన్ జయంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజున ర్యాలీలు నిర్వహిస్తారు. హనుమ నామ జపం చేస్తుంటారు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మద్యం దుకాణాలు తెరవకూడదని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ ఎవరైన నిబంధనలు ఉల్లంఘించి మద్యం దుకాణాలను తెరిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.
ఏప్రిల్ 17న కూడా..
ఈ నెలలో ఏప్రిల్ 17 బుధవారం కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూత పడ్డాయి. శ్రీరామనవమి సందర్భంగా జంట నగరాల్లో 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఖమ్మం సీటు విషయంలో పట్టువీడని పొంగులేటి, భట్టి.. డీకే వద్దకు పంచాయితీ..!
ఏర్పాట్లు పూర్తి..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
కాగా.. పండుగలు, పర్వదినాల్లో రాష్ట్రంలో మద్యం దుకాణాలను మూసివేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఎలాంటి వివాదాలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.