Trafic
141 Pending Challans : హెల్మెట్ ధరించకపోతే..ట్రిపుల్ రైడింగ్..ట్రాఫిక్ కు సంబంధించిన నియమ నిబంధనలు పాటించకపోతే..ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తుంటారు. నేరుగా ఇంటికే బిల్లు పంపిస్తారు లేదా చెకింగ్ చేసే సమయంలో సరైన పత్రాలు లేకపోతే..ఫైన్ లు విధిస్తుంటారు. కొంతమంది న్యాయపరంగా వారు విధించిన బిల్లులకు డబ్బులు కట్టేసి..మరోసారి అలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతుంటారు. అయితే..కొంతమంది డోంట్ కేర్ అంటుంటారు. ఫైన్ లు కట్టకుండా..టైమ్ పాస్ చేస్తుంటారు. తమకు ఫైన్ లు విధిస్తున్నారని తెలిసినా..తెలియకపోయినా..తప్పుల మీద తప్పులు చేస్తుంటారు. తాజాగా..ఓ బైకర్ ను ఆపి చెక్ చేయగా..ట్రాఫిక్ పోలీసులు అవాక్కయ్యారు. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 141 చల్లాన్లు ఉండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
Read More : YCP Vs TDP : బాలకృష్ణ అమాయక చక్రవర్తి, బాబుది మెలోడ్రామా – పేర్ని నాని
ఓ వ్యక్తి బైక్‌పై పెండింగ్ చలాన్ల లెక్క చూస్తే అవాక్కయిపోతారు. ఏకంగా 141 పెండింగ్ చలాన్లు పడ్డాయి. అయినా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా తిరిగేస్తున్నాడు బైక్ యజమాని. హైదరాబాద్‌లో జగదీశ్ మార్కెట్ దగ్గర వాహనాల తనిఖీల్లో ఓ బైక్ పై 141 చలాన్లు ఉన్నట్టు గుర్తించారు ట్రాఫిక్ పోలీసులు. వాహన యజమాని ఫిరోజ్ మొత్తం 33వేల రూపాయలు కట్టాల్సిందిగా సూచించారు ట్రాఫిక్ పోలీసులు. ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే…ఒకే తప్పు 141 సార్లు చేశాడు ఆ బైక్ యజమాని.
Read More : Doctor Attempt Murder : భార్యను చంపేందుకు వచ్చి బావమరిదిపై దాడి
అదే హెల్మెట్ లేకుండా ప్రయాణించడం. అంతేకాకుండా చలాన్లు అన్నీ ఒకే ప్రాంతంలో పడ్డాయి. జగదీశ్ మార్కెట్ ఏరియాలో డైమండ్ కేఫ్ సమీపంలోనే తిరుగతుండగా ప్రతీసారి ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. అవన్నీ కలిపితే 33 వేల రూపాయలు అయ్యాయి. చేసిన తప్పునే 141 సార్లు చేసి ఎన్ని సార్లు ఫైన్ వేసుకున్న తనకేంటి అంటూ తిరిగేస్తున్నాడు ఫిరోజ్. 141వ సారి అదే తప్పు చేసిన బైక్ యజమానిని అడ్డంగా బుక్ చేశారు. వాహనాన్ని సీజ్ చేశారు.