YCP Vs TDP : బాలకృష్ణ అమాయక చక్రవర్తి, బాబుది మెలోడ్రామా – పేర్ని నాని

అనని మాటని..చెడుగా చిత్రీకరించి రాజకీయ అవసరాల కోసం ఇలా చేయడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు సతీమణినిని ఎవరూ విమర్శించలేదన్నారు.

YCP Vs TDP : బాలకృష్ణ అమాయక చక్రవర్తి, బాబుది మెలోడ్రామా – పేర్ని నాని

Perninani

YCP Minister Perni Nani  : ఏపీలో రాజకీయాలు హీట్ ను పెంచుతున్నాయి. వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు తమను గత రెండేళ్లుగా అవమానిస్తోందని, బండబూతులు తిడుతున్నారని..తన కుటుంబ సభ్యులపై విమర్శలు చేస్తున్నారంటూ..టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏకంగా ప్రెస్ మీట్ భోరున విలపించడంతో పాలిటిక్స్ మరింత హీట్ పెంచేశాయి. దీనికి ప్రతిగా వైసీపీ కౌంటర్లు ఇచ్చాయి. తాజాగా..సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబంతో ప్రెస్ మీట్ నిర్వహించారు.

Read More : Chandrababu Tears: రాజకీయ లబ్ధి కోసం గౌరవాన్ని మీడియాకీడ్చారు – వైఎస్సార్సీపీ

ఇక ముందు అలాంటి వ్యాఖ్యలు చేస్తే..సహించబోమని..ఖబడ్దార్ అంటూ బాలకృష్ణ హెచ్చరించారు. దీనికి ప్రతిగా మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. బాలకృష్ణ ఓ అమాయక చక్రవర్తి…చంద్రబాబు తన అనుభవంతో మెలోడ్రామా పండించారని విమర్శలు గుప్పించారు. 2021, నవంబర్ 20వ తేదీ శనివారం మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించి..టీడీపీపై పలు విమర్శలు చేశారు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం..ఫోన్ లో రికార్డు చేయడం విరుద్ధమని…టీడీపీకి సంబంధించిన సభ్యులు బాబు మాట్లాడుతుండగా..రికార్డు చేశారని తెలిపారు. అనని మాటని..చెడుగా చిత్రీకరించి రాజకీయ అవసరాల కోసం ఇలా చేయడం దురదృష్టకరమన్నారు.

Read More : Chandrababu: నా అక్కను తిడితే తాట తీస్తాం – బాలకృష్ణ

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేసినట్లుగా…చిత్రీకరించడం వంటివి చేస్తున్నారని విమర్శించారు. వైసీపీపై పై చేయి సాధించాలని, జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించడం ఒక రాజకీయ దుర్మార్గచర్యగా ఆయన అభివర్ణించారు. చంద్రబాబు సతీమణినిని ఎవరూ విమర్శించలేదని, ఎవరూ కూడా వారి పేరు..ప్రస్తావన తేలేదని విశ్వసించాలని గతంలో జరిగిన విషయాలను ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఎన్టీరామారావు దుర్మార్గుడు..అంటూ ఆయన కన్నబిడ్డలను నమ్మించేటట్లుగా బాబు చేశారని, కన్నతండ్రిని వదిలేసిన విషయాలను గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. ఎన్టీరామారావు వ్యతిరేకంగా..వారి మనస్సుల్లో విషం బీజం వేశారని, అనని మాటను ఈరకమైన ఆపాదించడం సబబు కాదన్నారు. వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని మంత్రి పేర్నినాని సూచించారు.