Hyderabad man whisky is mixed with water : హైదరాబాద్ లో మద్యం ఎలా కల్తీ చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కేటుగాళ్లు టాలెంట్ చూస్తే వార్నీ..ఏం టాలెంట్ రా బాబూ అని నోరెళ్లబెట్టాల్సిందే. మద్యం బాటిల్ మూత సీల్ ఏమాత్రం చెక్కు చెదరకుండా లోపలున్న మద్యాన్ని కల్తీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మద్యం బాటిల్స్ ను సీల్ తీయకుండా మూతను తీయడం, ఆపై దానిలోని మద్యాన్ని వేరే బాటిల్ లోకి మార్చి, సగం నీరు నింపి, ఏ మాత్రమూ అనుమానం రాకుండా తిరిగి సీల్ వేయడం చూస్తే ఏం తెలివిరాబాబూ అంటాం.సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో తెలంగాణ ఎక్సయిజ్ అధికారుల దృష్టికి కూడా వెళ్లటంతో సదురు టాలెంటెడ్ బాబుల్ని చక్కగా సెల్ లో వేసారు పోలీసులు.
మద్యాన్ని డెలివరీ చేసే ఓ ట్రక్ లో ఉన్న ఇద్దరు ఈ మద్యం బాటిల్స్ సీల్ చాకచక్యంగా బాటిల్ లో ఉన్న మద్యం మరో బాటిల్ లోకి తీసి ఆ ఖాళీలో వాటర్ పోసి మళ్లీ చక్కగా అచ్చంగా ఫ్యాక్టీరీలో సీల్ వేసినట్లుగా పెట్టేస్తున్నారు. ఆ బాటిల్ ఓపెన్ చేసినట్లు కూడా ఎవ్వరికీ అనుమానం రాదు. అంత టాక్టీసుగా పనికానిచ్చేస్తున్నారు. మద్యాన్ని డెలీవరీ చేసే ఓ టక్కులో ఈ దందాను సాగుతోంది.
ఈ వీడియో వైరల్ కావడంతో చార్మినార్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ విభాగం ఓ కేసును రిజిస్టర్ చేసి, విచారణ చేపట్టారు. ఈ వీడియో మంగళవారం నాడు తొలిసారిగా వాట్స్ యాప్ లో కనిపించినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. తాము చేసే పని వీడియో తీస్తున్నారని చేసేవాళ్లకు తెలుసు..కానీ తామేదో ఘనకార్యం చేస్తున్నట్టుగా..ఈ పనితో తాము వైరల్ అయిపోతామని తామ టాలెంట్ చూసి భలే చేస్తున్నారే వీళ్లు మామూలోళ్లు కాదుగా అని అనుకునేలా ప్రవర్తించారు వాళ్లు.
వీరిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ జరిపారు. విచారణలో వీరిలో ఒకరు ఘట్ కేసర్ కు చెందిన రెడ్డిపోయిన సాయి అని..మరొకరు రంగారెడ్డి జిల్లాకు చెందిన రాంబాబుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. కల్లీకి అడ్డాగా మారిన ఈ ట్రక్ కూడా రెడ్డిదేనని..అతనే డ్రైవర్ గా వచ్చాడని, బాటిల్స్ లో మద్యాన్ని కల్తీ చేస్తుంటే రాంబాబు సహకరించాడని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ బాబుల టాలెంట్ మరి మీరు కూడా చూసేయండి..
https://youtu.be/lOKvIF7i6T4