Hyderabad : హైద‌రాబాద్ వాసుల‌కు అల‌ర్ట్‌.. ఈ ఆదివారం చికెన్‌, మ‌ట‌న్ షాపులు బంద్‌..

మ‌న‌లో చాలా మందికి ముక్క లేనిది ముద్ద దిగ‌దు.

Hyderabad Meat Shops Close : మ‌న‌లో చాలా మందికి ముక్క లేనిది ముద్ద దిగ‌దు. మిగిలిన రోజుల‌ సంగ‌తి ఎలా ఉన్నా స‌రే ఆదివారం మాత్రం త‌ప్ప‌కుండా నాన్‌వెజ్ ఉండాల్సిందే. ఆదివారం వ‌చ్చిందంటే చాలు చాలా మంది చికెన్‌, మ‌ట‌న్, చేప‌ల కోసం షాపుల ముందు క్యూ క‌డుతుంటారు. అయితే.. మాంసం ప్రియుల‌కు షాకింగ్ న్యూస్ ఇది. ఈ ఆదివారం (ఏప్రిల్ 21)న మాంసం దుకాణాలు బంద్ చేయ‌నున్నారు.

అయితే.. ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం కాదు. ఒక్క హైద‌రాబాద్‌లో మాత్ర‌మే. ఈ మేర‌కు గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ) ఆదేశాలు జ‌రీ చేసింది. మ‌హావీర్ జ‌యంతి సంద‌ర్భంగా ఈ ఉత్త‌ర్వులు జారీ చేసిన‌ట్లు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. ఈ నిర్ణ‌యంతో మటన్ షాపులతో పాటు కబేళాలు, మీట్, బీఫ్ మార్కెట్స్ అన్ని మూత ప‌డ‌నున్నాయి.

CM Revanth Reddy : సీఎం రేవంత్‌ రెడ్డికి ఫుల్ డిమాండ్‌..! కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్‌గా కీలక బాధ్యతలు

మ‌హావీర్ జ‌యంతి జైనులు జ‌రుపుకునే పండుగ‌ల్లో అతి ముఖ్య‌మైన‌ది. ఈ క్ర‌మంలో ఆ మ‌హావీరుడి జ‌న్మదినం సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని క‌బేళాల‌తో పాటు మాంసం దుకాణాలు మూసివేయాల‌ని ఆదేశించిన‌ట్లు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ రొనాల్డ్ రాస్ చెప్పారు. త‌మ ఆదేశాల‌ను ఎవ‌రైనా ఉల్లంఘించి షాపులు తెరిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. సోమ‌వారం తిరిగి య‌థావిధిగా తెర‌చుకోవ‌చ్చున‌ని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు