×
Ad

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోరైల్ ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇకపై ట్రైన్‌ టైమింగ్స్‌..

రాత్రి 11 గంటలు దాటాక ప్రయాణాలు చేసేవారికి ఇక ఇబ్బందే..

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోరైల్ ప్రయాణికులకు (ముఖ్యంగా రాత్రి 11 దాటాక ప్రయాణాలు చేసేవారికి) బ్యాడ్‌న్యూస్‌. ట్రైన్‌ టైమింగ్స్‌ మారాయి. ప్రతిరోజు ఇకపై లాస్ట్ ట్రైన్ టెర్మినల్ స్టేషన్‌ నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరుతుంది.

ఇప్పటివరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు టెర్మినల్‌ స్టేషన్ల నుంచి ట్రైన్లు రాత్రి 11.45 గంటలకు బయలుదేరేవి. చివరి స్టేషన్‌కు చేరుకునేందుకు దాదాపు 45 – 50 నిమిషాల వరకు సమయం పట్టేది. దీంతో అర్ధరాత్రి ప్రయాణాలు చేయాలనుకునే వారికి కూడా వీలుగా ఉండేది.

Also Read: Rohan Bopanna: టెన్నిస్‌కి రోహన్‌ బోపన్న గుడ్‌ బై.. భావోద్వేగభరిత కామెంట్స్‌

నవంబర్ 3వ తేదీ నుంచి మాత్రం మెట్రో రైల్ టైమింగ్స్ లో ఎల్అండ్‌టీ సంస్థ మార్పులు చేసింది. చివరి ట్రైన్ రాత్రి 11 గంటలకు బయలుదేరుతుందని ప్రకటించింది.

ఇక అన్ని టెర్మినల్స్ నుంచి ఉదయం 6 గంటలకు మెట్రో సేవలు ప్రారంభమవుతాయి. ఇప్పటివరకు ఆదివారం మాత్రం ఉదయం 7 గంటల నుంచి టెర్మినల్ స్టేషన్ల నుంచి రైళ్లు మొదలవుతున్నాయి. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 6 గంటలను బయలుదేరేవి.

గతంలో సాధారణ పని దినాల్లో, సెలవు దినాల్లో టైమింగ్స్‌లో ఉన్న మార్పులను ఇప్పుడు ఒకే టైమింగ్‌లోకి తీసుకువచ్చారు అధికారులు.

నవంబరు 3 నుంచి ట్రైన్‌ టైమింగ్స్‌ ఇలా (అన్ని రోజుల్లో)..

  • అన్ని టెర్మినల్స్ నుంచి ఉదయం 6 గంటలకు మెట్రో సేవలు షురూ
  • లాస్ట్ ట్రైన్ రాత్రి 11 గంటలకు బయలుదేరుతుంది..