Hyd Metro: మెట్రోరైల్ రెండో దశ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. పార్ట్-ఏలో ఐదు కారిడార్లలో..

హైదరాబాద్ లో మెట్రో రెండో దశ నిర్మాణానికి తెలంగాణ సర్కార్ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. రెండో దశలో 76.4 కిలో మీటర్ల పొడవు మెట్రో నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు

HYD Metro

Hyderabad Metro Second Phase: హైదరాబాద్ లో మెట్రో రెండో దశ నిర్మాణానికి తెలంగాణ సర్కార్ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. రెండో దశలో 76.4 కిలో మీటర్ల పొడవు మెట్రో నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు ఇస్తూ జీవో 196 జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రెండో దశ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మొత్తం రూ. 24,269 కోట్ల వ్యయంతో రెండో దశ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 30శాతం (రూ.7,313కోట్లు), కేంద్ర వాటా 18శాతం (రూ.4,230 కోట్లు) కేటాయింపులు చేసింది. అదేవిధంగా జైకా, ఏబీడీ, ఎన్డీబీ నిధులు 48శాతం (రూ. 11,693 కోట్లు), పీపీపీ పద్దతిలో 4శాతం (రూ. 1,033 కోట్లు) సేకరించనున్నారు.

Also Reada: Ponguleti Srinivasa Reddy: ‘పొలిటికల్ బాంబ్’ విషయంపై మంత్రి పొంగులేటి మరోసారి సంచలన వ్యాఖ్యలు

ఐదు కారిడార్లు ఇలా..
కారిడార్ -4లో
నాగోల్ – శంషాబాద్ (36.8 కిలో మీటర్లు)
కారిడార్ -5లో
రాయదుర్గం – కోకాపేట నియోపోలీస్ వరకు (11.6 కిలో మీటర్లు)
కారిడార్ -6లో
ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు (7.5 కిలో మీటర్లు)
కారిడార్ -7లో
మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు (13.4 కిలో మీటర్లు)
కారిడార్ -8లో
ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు (7.1 కిలో మీటర్లు)
రెండో దశలో పార్ట్ -బీ
కారిడార్ -9లో
శంషాబాద్ నుంచి ప్యూచర్ సిటీ (స్కిల్ యూనిర్శిటీ) వరకు (40 కిలో మీటర్లు)

 

hyderabad metro second phase