Ponguleti Srinivasa Reddy: ‘పొలిటికల్ బాంబ్’ విషయంపై మంత్రి పొంగులేటి మరోసారి సంచలన వ్యాఖ్యలు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కింద లబ్ధిదారులకు నాలుగు విడుతల్లో ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు

Minister Ponguleti Srinivasa Reddy
Minister Ponguleti Srinivasa Reddy : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. రెండు మూడు రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోస్తామని, మొదటి దశలో నాలుగు నుంచి ఐదు లక్షల ఇల్లు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక ఐదు లేదా ఆరు తేదీల నుంచి ఉంటుందని, లబ్ధిదారులతోనే ఇల్లు నిర్మింపజేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పట్టణ ప్రాంతాల్లో మాత్రం కాంట్రాక్టు అప్పగిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. నిజమైన లబ్ధిదారులను మాత్రమే ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేయడం జరుగుతుందని, సిఫారసులకు తావులేదని స్పష్టం చేశారు.
Also Read: Bandi Sanjay : బీఆర్ఎస్పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కింద నాలుగు విడుతల్లో ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. మొదటి విడతలో 1లక్ష, రెండవ విడతలో 1.25 లక్షలు, మూడవ విడతలో 1.75 లక్షలు, నాలుగవ విడతలో 1లక్ష రూపాయలు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఇంటి స్థలంలేని వారికి ప్రభుత్వ స్థలం ఇస్తామని, 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం ఉంటుందని చెప్పారు. గృహ నిర్మాణ శాఖ గత బీఅర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం అయ్యిందన్న పొంగులేటి.. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రత్యేక యాప్ రూపొందించామని, గ్రామ సభల ద్వారా ఇందిరమ్మ లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు.
Also Read: చంద్రబాబు చెప్పింది ఎంటి? అక్కడ జరుగుతున్నది ఏంటి?: బొత్స సత్యనారాయణ
ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో రాజకీయ ప్రమేయం ఉండదని, పేదవారిలో కడుపేదలకు ముందు ఇండ్ల కేటాయింపు ఉంటుందని, ఈనెల 28లోపు మొదటి దశ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పొంగులేటి చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, నాలుగు రాష్ట్రాల నుంచి ఈ పథకంపై అధ్యయనం చేశామని చెప్పారు. గ్రీన్ ఛానల్ ద్వారా లబ్ధిదారులకు డబ్బు చెల్లిస్తామని అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ‘పొలిటికల్ బాబ్ ’ విషయంపైనా పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాంబ్ పేలే సమయంలో పేలుతుందని పేర్కొన్నారు.