చంద్రబాబు చెప్పింది ఎంటి? అక్కడ జరుగుతున్నది ఏంటి?: బొత్స సత్యనారాయణ

దీనిపై ద్వంద్వ వైఖరి అవలభింస్తే ప్రజలు ఊరుకోరని బొత్స సత్యనారాయణ అన్నారు.

చంద్రబాబు చెప్పింది ఎంటి? అక్కడ జరుగుతున్నది ఏంటి?: బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana

Updated On : November 2, 2024 / 2:27 PM IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖకు వచ్చిన సందర్భంగా అక్కడి స్టీల్ ప్లాంట్‌పై ఆయన వైఖరి ఎంటో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖలో బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై చంద్రబాబు చెప్పింది ఎంటని, అక్కడ జరుగుతున్నది ఏంటని నిలదీశారు.

దీనిమీద వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ద్వంద్వ వైఖరి అవలభింస్తే ప్రజలు ఊరుకోరని బొత్స సత్యనారాయణ అన్నారు. పాడి రైతులుకు సంబంధించి సమస్య తీవ్రంగా ఉందని, చరిత్రలో ఎన్నడూలేని విధంగా పాల ధరలు తగ్గించారని, దీనిపై అధికారులతో సమీక్ష చేసి పాడి రైతులకు న్యాయం చేయ్యాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.

ఉచిత ఇసుక పేరుతో నాలుగు నుంచి ఐదు జీవోలు మార్చారని బొత్స సత్యనారాయణ అన్నారు. ఇసుక నిర్దిష్టమైన విధానాన్ని ఎప్పటి నుంచి తీసుకువస్తారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, పిల్లల మీద అఘాయత్యలు జరుగుతున్నాయని చెప్పారు.

దీని మీద సమీక్ష నిర్వహించాలని, చట్టం ఒక్కొక్కరికీ ఒక్కోలా పనిచేస్తుందా అని బొత్స సత్యనారాయణ నిలదీశారు. అధికారంలో ఉన్న వారిని ఒక విధంగా, లేనివారిని మరో విధంగా పోలీసులు చూస్తున్నారని అన్నారు. పోలవరం పై చంద్రబాబు వివరణ ఇవ్వాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ తమిళనాడులోని ఆ చిన్న గ్రామంలో కమలా హారిస్ బ్యానర్