Hyderabad metro train
Metro Rail New Record : హైదరాబాద్ మెట్రో రైలు కొత్త రికార్డు సృష్టించింది. నగరంలో కూల్ అండ్ సేఫ్ జర్నీని పరిచయం చేసిన హైదరాబాద్ మెట్రో రైలు అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ప్రయాణికులను ఆకర్షించింది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలు 40 కోట్ల ప్రయాణికుల మార్క్ ను చేరుకుంది. 2017 నవంబర్ 28న హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభం అయింది. దీన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.
అప్పటి నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ మెట్రో రైలులో 40 కోట్ల మంది ప్రయాణం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ మెట్రో రైలుకు మంచి ఆదరణ ఉంది. ఎక్కువ మంది మెట్రో రైలులో ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహంలో నుంచి బయటపడేందుకు జనాలంతా మెట్రోను ఆశ్రయిస్తున్నారు.
Hyderabad Metro Rail: గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో రైల్.. పూర్తి వివరాలు ఇవిగో…
కూల్ ఆండ్ సేఫ్ జర్నీ కావడంతో మెట్రోలో ప్రయాణిస్తున్నారు. దీంతో రోజు రోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. దీంతో మెట్రోలో రోజుకు సగటున 4లక్షల 90 వేల మంది ప్రయాణిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 5లక్షలు దాటనుంది.
భారత ప్రభుత్వ గణన ప్రకారం.. మెట్రో రైలు ప్రయాణికుల సంఖ్యం రోజుకు 6లక్షల 70 వేలు. అయితే హైదరాబాద్ లో ఇంకా ఆ నెంబర్ కు చేరుకోలేదు. ప్రస్తుతం మెట్రోలో రోజుకు లక్షా 20 వేల మంది ప్రయాణిస్తున్నారు. మరో లక్షా 40 వేల మంది ఐటీ ఉద్యోగులు జర్నీ చేస్తున్నారు.