Hyderabad Metro Rail : హైదరాబాద్ లో ఉదయం గం.6 నుంచే మెట్రో రైలు సేవలు

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.  మెట్రో రైలు సేవలు ఇక నుంచి ఉదయం 6 గంటలకే  అందుబాటులోకి రానున్నాయి. పురపాలక, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు మెట్రో రైల్ లిమిటెడ్  ఎండీ. ఎన్వీ.ఎస్

Metrao Rail Services

Hyderabad Metro Rail : హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.  మెట్రో రైలు సేవలు ఇక నుంచి ఉదయం 6 గంటలకే  అందుబాటులోకి రానున్నాయి. పురపాలక, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు మెట్రో రైల్ లిమిటెడ్  ఎండీ. ఎన్వీ.ఎస్.రెడ్డి  స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

అభినవ్ సుదర్శి అనే ప్రయాణికుడు మెట్రో రైలు కష్టాలపై కొన్ని వీడియోలను పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.  ఉదయం 6 గంటలకే ప్రయాణికులు మెట్రో స్టేషన్లకు వస్తున్నారు. కానీ సర్వీసులు 7 గంటలకు కానీ ఫ్రారంభం కావటంలేదని…… అంతసేపు ప్రయాణికులు వేచి ఉండాల్సి వస్తోంది.
Also Read : Andhra, Odisha CMs Meeting : ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌తో, రేపు ఏపీ సీఎం జగన్ భేటీ
ఒకవేళ క్యాబ్ బుక్ చేసుకుంటే… ఉదయం పూట కాబట్టి  అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు.  ప్రయాణికు సౌలభ్యం కోసం ఉదయం 6గంటలనుంచే మెట్రో రైలు సేవలను ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను అంటూ కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లాడు.

ఆ ట్వీట్ లో ఉదయం 6 గంటలకే మెట్రో స్టేషన్లలో ఉన్న ప్రయాణికుల షార్ట్ వీడియోను ప్రదర్శించాడు. దీంతో కేటీఆర్ ఆవీడియోను సమర్ధిస్తూ, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి   రీట్వీట్ చేయటంతో ఈనిర్ణయం తీసుకున్నారు.