Andhra, Odisha CMs Meeting : ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌తో, రేపు ఏపీ సీఎం జగన్ భేటీ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఒడిషా ముఖ్యమంత్రి నవాన్ పట్నాయక్ తో సమావేశం కానున్నారు. ఉభయ రాష్ట్రాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న  పలు అంశాలపై వారిద్దరూ చర

Andhra, Odisha CMs Meeting :  ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌తో, రేపు ఏపీ సీఎం జగన్ భేటీ

Cm Jagan Review For Odisha Cm Meeting

Andhra, Odisha CMs Meeting :  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఒడిషా ముఖ్యమంత్రి నవాన్ పట్నాయక్ తో సమావేశం కానున్నారు. ఉభయ రాష్ట్రాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న  పలు అంశాలపై వారిద్దరూ చర్చలు జరపనున్నారు. మంగళవారం సాయంత్రం భువనేశ్వర్ వెళ్లే సీఎం జగన్, నవీన్ పట్నాయక్ తో ప్రధానంగా మూడు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల అంశాలపై ఆయన నవీన్ పట్నాయక్ తో చర్చించనున్నారు. అందులో భాగంగా ఈరోజు సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఒడిషా సీఎం తో చర్చించే అంశాలపై అధికారులతో సమావేశం అయ్యారు.

రేపు చర్చించే అంశాలలో నేరడి బ్యారేజి ప్రాజెక్టు గురించి ఆయన మాట్లాడనున్నారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన కొంత భూమి ఒడిషా రాష్ట్రం నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఈబ్యారేజి నిర్మాణం కారణంగా ఉభయ రాష్ట్రాలకూ కలగనున్న ప్రయోజనాలను సీఎం జగన్, నవీన్ పట్నాయక్ కు వివరించనున్నారు. బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా వైపునుంచి 103 ఎకరాలు అవసరమని ఇందులో 67 ఎకరాలు రివర్‌బెడ్‌ ప్రాంతమేనన్న అధికారులు సీఎం జగన్ కు వివరించారు. బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశావైపు కూడా సుమారు 5–6 వేల ఎకరాలకు తక్షణమే సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు.

అలాగే జంఝావతి ప్రాజెక్టు అంశాన్ని కూడా సీఎం జగన్ రేపటి సమావేశంలో ప్రస్తావించనున్నారు. ప్రస్తుతం రబ్బర్‌ డ్యాం ఆధారంగా సాగునీరు ఇస్తున్నామని…. ఇందువల్ల 24,640 ఎకరాల్లో కేవలం 5 వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నామని ఈరోజు జరిగిన సమావేశంలో అధికారులు సీఎం జగన్ కు వివరించారు.

ఈ ప్రాజెక్టు పూర్తిచేస్తే రైతులకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని చెబుతూ… ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ఒడిశాలో 4 గ్రామాలు పూర్తిగా, పాక్షికంగా 6 గ్రామాలు ముంపునకు గురవుతాయని అధికారులుతెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ఒడిశాలో దాదాపు 1174 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని…ఇందులో 875 ఎకరాలు ప్రభుత్వ భూమేనని అధికారులు వివరించారు. ఆర్‌ అండ్‌ ఆర్‌కు సహకరించాలని సీఎం జగన్ ఒడిశాను కోరనున్నారు.

Also Read : TDP Protest on Petrol Rates : టీడీపీ ఆధ్వర్యంలో రేపు పెట్రోల్ బంకుల వద్ద ధర్నా

కొఠియాగ్రామాల అంశాన్ని కూడా సీఎం జగన్ నవీనా పట్నాయక్ తో చర్చించనున్నారు. కొఠియా గ్రామాల్లో ఇటీవల జరిగిన పరిణామాలను, ఆ గ్రామాల వివాదాలకి సంబంధించిన మొత్తం వివరాలను అధికారులు సీఎం జగన్ కు వివరించారు. 21 గ్రామాల్లో 16 గ్రామాల ప్రజలు ఏపీతోనే ఉంటామంటూ తీర్మానాలు చేసి ఇచ్చారని విజయనగరం జిల్లా కలెక్టర్‌ సూర్యకుమారి సీఎం జగన్ కు వివరించారు.

ఇటీవల ఆయా గ్రామాల్లో ఎన్నికలు కూడా నిర్వహించామని సమావేశంలో పాల్గోన్నఅధికారులు తెలిపారు. కొఠియా గ్రామాల్లో దాదాపు 87శాతానికి పైగా గిరిజనులు ఉన్నారని, వారికి సేవలు అందించే విషయంలో అవాంతరాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని అధికారులు సీఎం జగన్ కు వివరించారు.