TDP Protest on Petrol Rates : టీడీపీ ఆధ్వర్యంలో రేపు పెట్రోల్ బంకుల వద్ద ధర్నా

పెరుగుతున్న పెట్రో.డీజిల్ ధరలకు నిరనసగా రేపు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపడతామని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

TDP Protest on Petrol Rates : టీడీపీ ఆధ్వర్యంలో రేపు పెట్రోల్ బంకుల వద్ద ధర్నా

Tdp Cader Protest At Petrol Bunks

TDP Protest on Petrol Rates :  పెరుగుతున్న పెట్రో.డీజిల్ ధరలకు నిరనసగా రేపు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపడతామని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం 12గంటలనుంచి 1 గంట వరకు టీడీపీ శ్రేణులు పెట్రోల్ బంక్ ల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టీడీపీ వాయకులకు కార్తకర్తలకు పిలుపునిచ్చారు.

తాను అధికారంలోకి వస్తే.. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తామని పాదయాత్ర చేస్తున్న సమంలో సీఎం జగన్ రెడ్డి హామీ ఇచ్చారని…. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం పెట్రోల్ పై రూ.16, డీజిల్ పై రూ.17 తగ్గించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

Also Read : FB Own Survey : ఫేస్‌బుక్‌‌తో 36 కోట్ల మందికి రిస్క్!

పక్క రాష్ట్రాల్లో అదనపు సుంకాలు తగ్గించినా.. మన రాష్ట్రంలో మొండిచేయి చూపారని ఆయన దుయ్యబట్టారు. జగన్ మోహన్ రెడ్డి అవినీతి, దుబారా, చేతకాని పరిపాలనా విధానాలతో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని చంద్రబాబు అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్న రాష్ట్రానికి పరిశ్రమలు రావు… ఉద్యోగాలు, ఉపాధి రాదు అని ఆయన తెలిపారు.

కరోనా కష్టాల్లో ఉన్న కుటుంబాలపై పెట్రో భారం పిడుగుపాటుగా మారిందిని…అధిక డీజిల్ ధరల కారణంగా ట్రాక్టర్, నూర్పిడి ఖర్చులు పెరిగి వ్యవసాయం దెబ్బతింటోందని ఆయన విమర్శించారు. అధిక పెట్రోల్ ధరల కారణంగా ఉద్యోగులు, కార్మికులు, చిరు వ్యాపారులు దెబ్బతింటారు. లారీల యజమానాలు, కార్మికులు దెబ్బతినడమే కాక.. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు తారాస్థాయికి చేరతాయని చంద్రబాబు అన్నారు.

పెట్రో భారాలకు జగన్ రెడ్డి ప్రభుత్వ దోపిడీ, దుబారాలే కారణమని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఉన్నాయన్నారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక దేశంలో అధికంగా పెట్రోల్ ధర రూ.110.98కి పెంచారని చంద్రబాబు అన్నారు.