FB Own Survey : ఫేస్‌బుక్‌తో 36 కోట్ల మందికి రిస్క్!
Facebook own researchers : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సర్వీసుతో 360 మిలియన్ల (36 కోట్ల) మందికి రిస్క్ ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Facebook's Own Researchers Found The App Is Bad For 360 Million Of Its Users, According To A Report
Facebook own researchers : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సర్వీసుతో 360 మిలియన్ల (36 కోట్ల) మందికి రిస్క్ ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఫేస్‌బుక్ తమ సర్వీసు ప్రభావం యూజర్లపై ఎంతవరకు ఉందో తెలుసుకునేందుకు సొంతంగా ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఫేస్ బుక్ రీసెర్చర్లు లోతుగా విశ్లేషణ జరిపారు. ఫేస్‌బుక్ యూజర్లలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి ఫేస్‌బుక్ యాప్ ద్వారా నిద్రలేమి, పని, బంధాలు, పిల్లల పెంపకం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని గుర్తించారు. ఫేస్‌బుక్ స్వయంగా నిర్వహించిన సర్వేలో తేలిందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
ఫేస్ బుక్ యాప్ వినియోగించుకునే వారిలో మొత్తంగా 2.9 బిలియన్ల మంది యూజర్లలో 360 మిలియన్ల మంది (12.5శాతం) ఫేస్ బుక్ కు ప్రభావితం అవుతున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ సంస్థ అంచనా వేసింది. FB యాప్ వినియోగానికి బానిసగా మారిపోయేవారి సంఖ్య పెరిగిపోతుందని రీసెర్చ్ డేటాలో వెల్లడించింది. తద్వారా ఫేస్‌బుక్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని అంచనా వేశారు. ఈ తరహాలో వినియోగాన్ని ఫేస్‌బుక్ సమస్యాత్మకమైనదిగా వెల్లడించింది. మాములుగా అయితే ఏ కంపెనీ అయినా తమ యాప్ ను యూజర్లు వినియోగించుకోవాలని కోరుకుంటాయి. కానీ, ఫేస్ బుక్ యూజర్ల ప్రయోజనాలే లక్ష్యంగా మెటా ఈ సర్వేను చేయించిందని పరిశోధకులు తెలిపారు.
కొన్నేళ్ల క్రితమే ఫేస్‌బుక్ దుష్ప్రభావాలను అంచనావేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఈ బృందం పలు సూచనలు చేయడంతో 2019లో ఈ బృందాన్ని ఫేస్‌బుక్ రద్దు చేసింది. 2020లో అంతర్గత సమావేశంలో సర్వేలో కనిపెట్టిన అంశాలను బృందం ప్రస్తావించింది.ఫేస్ బుక్ అంతర్గత డాక్యుమెంట్ల నుఫ్రాన్సిస్ హ్యూగన్ అనే మాజీ ఉద్యోగి ఫేస్ బుక్ ఫైల్స్ సిరీస్ పేరిట విడుదల చేశాడు. దాంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇన్ స్టాగ్రామ్ లో వినియోగించిన యూజర్లు కూడా మానసికంగా ప్రతికూల ప్రభావానికి గురవుతున్నారని మరో రిపోర్టు పేర్కొంది.
Read Also : CM KCR : సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ – Live Updates