Nampally Numaish 2023-Hyderabad Metro : నాంపల్లి నుమాయిష్ సందడి.. రాత్రి 12గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు

నాంపల్లి నుమాయిష్ సందడి మొదలైంది. దీంతో మెట్రో రైలు సేవలు కూడా పెరిగాయి. 12గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు ఉండనున్నాయి.

Nampally Numaish 2023-Hyderabad Metro

Nampally Numaish 2023-Hyderabad Metro : హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు సమయాన్ని పెంచారు నిర్వాహకులు. ప్రతీరోజు రాత్రి 11గంటలకే చివరి మెట్రో సర్వీసు ఉంటుంది. కానీ ఈ నుమాయిష్ సందర్భంగా మెట్రో రైలు సేవల సమయాన్ని పెంచారు. నాంపల్లిలో నుమాయిష్‌ జనవరి 1 నుంచి ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. ఈ ఎగ్జిబిషన్ కు నగరవాసులు భారీగా వస్తారు. భారత్ లోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు ఈ ఎగ్జిబిషన్ లో వారి వారి ఉత్పత్తులను విక్రయిస్తుంటారు.

కొత్త సంవత్సరం వచ్చిదంటే ఇక నగరంలో నుమాయిష్ సందడి ప్రారంభమవుతుంది. అలా జనవరి 1న నుమాయిష్ ప్రారంభమైన సందర్భంగా.. రైలు సేవలను రాత్రి మరో గంటపాటు పొడిగించి యాజమాన్యం. అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఎల్బీనగర్‌, మియాపూర్‌, నాగోల్‌, రాయదుర్గం నుంచి సాధారణంగా రాత్రి 11 గంటలకే చివరి మెట్రో సర్వీసులు బయలుదేరతాయి. అయితే.. నుమాయిష్‌ ముగిసేంత వరకు చివరి సర్వీసు అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరుతుందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

మియాపూర్‌-ఎల్బీనగర్‌, నాగోల్‌ – రాయదుర్గం కారిడార్లలో మాత్రమే ఈ వెసులుబాటు అమలులో ఉంటుందన్నారు. గాంధీభవన్‌ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 4 టిక్కెట్‌ కౌంటర్లను 6 కు పెంచారు. ప్రయాణీకులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.