నీలోఫర్ డాక్టర్ల అరుదైన ఘనత.. పసికందుల ఊపిరితిత్తుల్లోకి పేగులు.. ఆపరేషన్ తో నలుగురు పిల్లలు, నాలుగు కుటుంబాలు ఆల్ హ్యాపీ..

అసలు ఆ జబ్బు కనుక్కోవడమే చాలా కష్టమన్నారు. అయితే, ఫస్ట్ వన్ అవర్ లోనే గుర్తించగలిగి..

Niloufer Hospital : హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. పసికందుల ప్రాణాలను కాపాడారు. కంజెంటల్ డయాఫ్రాగ్మాటిక్ హెర్నియాతో బాధపడుతున్న పసికందులకు సర్జరీ చేశారు. అప్పుడే పుట్టిన పసికందు ఊపిరితిత్తుల్లోకి పేగులు రావడాన్నే
కంజెంటల్ డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా అంటారని డాక్టర్లు తెలిపారు.

ఈ తరహా కేసుల్లో పసికందుని బతికించటం కొంచెం కష్టమైన పనే అని డాక్టర్లు తెలిపారు. అసలు ఆ జబ్బు కనుక్కోవడమే చాలా కష్టమన్నారు. అయితే, బేబీ పుట్టిన ఫస్ట్ వన్ అవర్ లోనే గుర్తించగలిగి స్టెబిలై చేసి ఫస్ట్ 24 గంటల్లోనే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందన్నారు.

Also Read : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్.. డబ్బులు రిలీజ్ చేసిన ప్రభుత్వం.. మీకు వస్తాయో రావో చెక్ చేసుకోండి..

ఒక్కరోజులో నీలోఫర్ ఆసుపత్రిలో ఈ రకమైన కేసులు నాలుగు వచ్చాయని, వారందరికీ ఆపరేషన్ చేశామని తెలిపారు. అన్ని సర్జరీలు సక్సెస్ అయ్యాయని, పసికందులు చక్కగా కోలుకున్నారని డాక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు. వారందరిని డిశ్చార్జ్ కూడా చేస్తున్నామన్నారు.

అందులో ఒక కేసు.. పదేళ్లుగా పిల్లలు లేక ఇన్ ఫర్టిలిటీ ట్రీట్ మెంట్ ద్వారా పుట్టిన బేబీ ఒకరు ఉన్నట్లు డాక్టర్ల బృందం చెప్పింది. పసికందులు అందరూ చక్కగా రికవరీ అయ్యారని, వారిని డిశ్చార్జ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని డాక్టర్ల బృందం వెల్లడించింది.

డాక్టర్ నారాయణ ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీ, ప్రొఫెసర్ స్వప్న నెనెటాలజీ హెచ్ఓడి, గైనకాలజిస్ట్ టీమ్ డెలివరీ చేశారు. డాక్టర్ రవికుమార్ సూపరింటెండెంట్ అండ్ డాక్టర్ జ్యోతి RMO ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్లు జరిగాయి. అరుదైన ఆపరేషన్ చేసి నలుగురు పిల్లల ప్రాణాలను డాక్టర్లు కాపాడంతో వారి తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. డాక్టర్ల టీమ్ కి వారు థ్యాంక్స్ చెప్పారు.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here