Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్.. డబ్బులు రిలీజ్ చేసిన ప్రభుత్వం.. మీకు వస్తాయో రావో చెక్ చేసుకోండి..
నిర్మాణం పూర్తయ్యాక మరో లక్ష రూపాయల సాయాన్ని ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం అందించనుంది.

Indiramma houses
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 20.19 కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం. బేస్ మెంట్ వరకు పూర్తయిన ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో ఆ డబ్బును జమ చేసింది. పలువురు లబ్దిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయల విలువైన చెక్కులు ఇచ్చారు. బేస్ మెంట్ వరకు ఇళ్లు నిర్మిస్తే లక్ష రూపాయలు, గోడలు నిర్మించాక 1.25 లక్షలు, స్లాబ్ వేశాక రూ.1.75 లక్షలు, నిర్మాణం పూర్తయ్యాక మరో లక్ష రూపాయల సాయాన్ని ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం అందించనుంది.
ఈ స్కీమ్ కింద తొలుత ఇళ్ల స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రెండో విడతలో స్థలం లేని వారికి స్థలమిచ్చి 5 లక్షల ఆర్థిక సాయం ఇస్తామంది.
Also Read : సీఎం రేవంత్‌కు తప్పిన ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
ఇందిరమ్మ ఇళ్లను మొదటి దశలో అత్యంత నిరుపేదలకు, అర్హులకు మాత్రమే కేటాయించాలని సీఎం రేవంత్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ పథకం పారదర్శకంగా, నిరుపేదలకు న్యాయం చేసేలా అమలు కావాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్తగా పని చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సిమెంట్, స్టీల్ తదితర సామగ్రిని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్.
ఇళ్లు లేని పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ స్కీమ్ కింద సొంత స్థలం ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం నాలుగు విడతల్లో ఆర్థిక సాయం అందిస్తారు. ఒక్కో లబ్ధిదారునికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం లభిస్తుంది. మొదటి విడతగా పునాది కోసం లక్ష రూపాయలు, ఆ తర్వాత గోడల నిర్మాణం, పైకప్పు నిర్మాణం, చివరగా ఇంటి నిర్మాణం పూర్తి.. ఇలా నాలుగు విడతల్లో 5 లక్షలు రూపాయలు లబ్దిదారుల ఖాతాల్లో జమ కానుంది.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here