లిక్కర్ ప్లీజ్ అంటున్నారు మందుబాబులు. ఒక్క క్వార్టర్ ఉందా ? లేకపోతే 90 ML, అదీ లేదా ? 60 ML..ప్లీజ్ ఇవ్వండి..సార్..నోరు ఎట్లనో అయిపోతుంది..దిమాక్ కరాబ్ అయితోంది..చేతులు..కాళ్లు వంకర్లు పోతున్నాయి..ఇవ్వండి సార్ అంటూ మద్యం ప్రియుళ్లు కోరుతున్నారు.
మందు దొరక్క చాలా మంది అల్లాడిపోతున్నారు. దిక్కుమాలిన కరోనా ఎందుకొచ్చింది..అనుకుంటున్నారు. మందు ఎక్కడ దొరుకుతుందా ? అంటూ వెతుకుతూనే ఉన్నారు. కానీ నో ఛాన్స్. రోజు మద్యం సేవించే వారి పరిస్థితి మరి దారుణంగా తయారైంది. కొంతమంది పిచ్చెక్కినట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఏకంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. రోజు మద్యం సేవించే వారు తట్టుకోలేకపోతున్నారు. వారు పిచ్చెక్కినట్లుగా వ్యవహరిస్తున్నారు. వీరి పరిస్థితి చూసి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. 2020, మార్చి 30వ తేదీ సోమవారం ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి భారీగా మద్యం బాధితులు క్యూ కడుతున్నారు. వీరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. భారతదేశంలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. కేసులు అధికమౌతుండడంతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓ నిర్ణయం తీసుకున్నారు. 2020, మార్చి 22వ తేదీ జనతా కర్ఫ్యూ విధిస్తున్నట్లు, రోగులకు సేవ చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియచేసేందుకు చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చారు.
దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్ సపోర్టు ఇచ్చారు. కేవలం 14 గంటలు కాదు..24 గంటలు పాటిద్దామని పిలుపునిచ్చారు. మద్యం దుకాణాలు కూడా బంద్ అవుతాయని వెల్లడించారు. దీంతో మందుబాబులు అలర్ట్ అయ్యారు. రెండు..మూడు రోజులకు సరిపడా మద్యాన్ని కొనుగోలు చేసుకున్నారు.
2020, మార్చి 23వ తేదీ సోమవారం రాత్రి సీన్ ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి 8 గంటలకు మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మద్యం ప్రియుళ్లు షాక్ తిన్నారు. బయటకు వెళ్లి తెచ్చుకుందామంటే..ఆల్ రెడీ షాపులు బంద్ అయిపోయాయి. ఏమీ చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఏకంగా ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ షట్ డౌన్ కొనసాగనుంది.
దేశవ్యాప్తంగా వైన్స్ షాపులు, బార్లు క్లోజ్ అయ్యాయి. బార్లపైకి దాడులకు తెగబడుతున్నారు. ఒక్కరోజైనా..లేదా రోజుకు కొన్ని గంటల పాటు వైన్ షాపులు ఓపెన్ చేయాలని అంటున్నారు. కేరళ రాష్ట్రాన్ని ఉదహారణగా చూపుతున్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.
Also Read | ప్రభుత్వ పరిధిలోకి ప్రైవేట్ ఆసుపత్రులు: జగన్ కీలక నిర్ణయం