పాతబస్తీ ఘటనతో హైడ్రా చర్యలు.. మ్యాన్‌హోల్‌ తెరిచి ఉంటే ఈ నంబరుకు ఫోన్ చేయండి అంటూ..

ఆ చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేక‌పోవ‌డంతో హైడ్రా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. (Open Manhole)

Open Manhole

Open Manhole: అసలే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై నీళ్లు నిలుస్తుండడంతో వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆపై మ్యాన్‌హోళ్లు కూడా తెరిచి ఉంటే ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుంది. దీంతో మ్యాన్‌హోల్ మూత తెరిచి కనిపిస్తే 9000113667 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని హైడ్రా సూచించింది.

ఇటీవల హైదరాబాద్‌లోని పాతబస్తీలోని మౌలాకా చిల్లాలోని మ్యాన్‌హోల్‌లో ఓ చిన్నారి పడిపోవడం కలకలం రేపింది. ఆ చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేక‌పోవ‌డంతో హైడ్రా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. (Open Manhole)

Also Read: హైదరాబాద్‌ మెట్రోరైల్‌ నిర్వహణ మా వల్ల కాదు.. చేతులెత్తేస్తున్న ఎల్‌అండ్‌టీ!

మ్యాన్‌హోల్‌ తెరిచి ఉండడాన్ని హైడ్రా తీవ్రంగా పరిగణించింది. ఆ మ్యాన్‌హోల్‌ అలా ఉండడానికి బాధ్యుల్ని గుర్తించడానికి విచారణకు ఆదేశించింది. అక్కడి ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను సేకరించింది.

స్థానిక కార్పొరేటర్ ఆదేశాలతో మౌలాకా చిల్లాలో మ్యాన్‌హోల్ తెరిచి మట్టి తీసే పనిని హైడ్రా చేపట్టింది. అయితే, కొన్నేళ్లుగా అక్కడ మట్టి పేరుకుపోవడంతో జలమండలి జెట్టింగ్ మెషీన్లతో పనిని ప్రారంభించింది.

బుధవారం పని ముగిసిన తర్వాత మ్యాన్‌హోల్‌ మూత వేయకుండా సిబ్బంది వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. నిన్న ఉదయం స్కూలుకి వెళ్లే సమయంలో ఓ చిన్నారి అందులో పడిపోవడం కలకలం రేపింది.