Outer Ring Road: ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్త ట్రాఫిక్ నిబంధనలు.. నేటి నుంచే అమలు

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించే వారికి గమనిక. ఈ రహదారిపై ప్రయాణించే వారికి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

Hyderabad ORR

Outer Ring Road -Hyderabad: హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్త స్పీడ్ లిమిట్స్ సంబంధించి సైబరాబాద్ పోలీసులు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. స్పీడ్ లిమిట్ ను తాజాగా 120 కిలోమీటర్లకు పెంచారు. ఇంతకుముందు అత్యధిక స్పీడ్ లిమిట్ 100 కిలోమీటర్లుగా ఉండేది. నిర్దేశిత వేగానికి మించి వెళితే జరిమానా విధించేవారు. అయితే తాజాగా వేగ పరిమితిని 120 కిలోమీటర్లకు పెంచారు.

ఔటర్ రింగ్ రోడ్డుపై టూ వీలర్స్, పాదచారులకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని సైబరాబాద్ పోలీసులు పునరుద్ఘాటించారు. కాగా, కార్లలో దూర ప్రాంతాలకు వెళ్లేవారు సమయం ఆదా చేయడానికి ఎక్కువగా ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తుంటారు. హైదరాబాద్ నగరంలోనూ ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన వారు కూడా ట్రాఫిక్ నుంచి తప్పించుకునేందుకు ఔటర్ రింగ్ రోడ్డును వినియోగిస్తుంటారు.

ఔటర్ రింగ్ రోడ్డుపై నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ రూల్స్
లేన్ 1 అండ్ 2 లో 100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్
లేన్ 3 అండ్ 4 లో 80 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్
ఐదవ లేన్ లో 40 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్
40 కిలోమీటర్ల స్పీడ్ కన్నా తక్కువ వెళ్లే వాహనాలకు అనుమతి లేదు

Also Read: ఫిలింనగర్ లో బెంజ్ కారు బీభత్సం.. హై హీల్స్ భుజాన వేసుకుని వెళ్లిపోయిన యువతి

ఓఆర్ఆర్ పై గుంతలు
మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ సరిగా లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. భారీగా టోల్ ఫీజులు వసూలు చేస్తున్నా రోడ్ల నిర్వహణ సరిగా లేదని చెబుతున్నారు. ఓఆర్ఆర్ పై పెద్ద సంఖ్యలో గుంతలు ఏర్పడ్డాయని చూపిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా 3, 4 లేన్లలో ఎక్కువగా గుంతలు పడ్డాయి. దీంతో భారీ వాహనాలు 1, 2 లేన్లలోకి వస్తుండడంతో ప్రమాదాలు జరిగే అవకాశముందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వర్షాల కాలంగా గుంతలు ఏర్పడ్డాయని, త్వరలోనే గుంతలు పూడుస్తామని అధికారులు చెబుతున్నారు.