×
Ad

Hyderabad: డ్రంకెన్ డ్రైవింగ్‌ చేస్తే ఇక అంతే.. ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌

సెక్షన్ 185 మోటార్ వాహనాల చట్టం కింద డ్రంకెన్ డ్రైవింగ్‌ నేరమని, రూ.10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధిస్తామని అన్నారు.

Representative Image

Hyderabad: హైదరాబాద్‌లో మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమయ్యారు. డిసెంబర్ 24 నుంచి 30 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.

డ్రంకెన్ డ్రైవింగ్‌పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు చేస్తారు. రోడ్డు భద్రతే లక్ష్యంగా ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు చెప్పారు. (Hyderabad)

సెక్షన్ 185 మోటార్ వాహనాల చట్టం కింద డ్రంకెన్ డ్రైవింగ్‌ నేరమని, రూ.10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధిస్తామని అన్నారు. డ్రంకెన్‌ డ్రైవింగ్‌లో ఒకసారి పోలీసులకు దొరికినప్పటికీ మళ్లీ అటువంటి నేరానికి పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలలు లేదా శాశ్వతంగా రద్దు చేసే అవకాశం ఉంటుందని అన్నారు.

Also Read: వెండి కొంటున్నారా? కొనేముందు ఈ జాగ్రత్తలు తీసుకోకపోయారో..

మద్యం మత్తులో ప్రమాదం జరిగితే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. వారికి అనుమతి ఇచ్చిన వాహనాల యజమానులు, తల్లిదండ్రులపై కేసులు పెడతామని తెలిపారు.

ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే ప్రజలు ఫేస్‌బుక్, ఎక్స్‌, వాట్సాప్ (8712661690), హెల్ప్‌లైన్ (9010203626) ద్వారా తెలియజేయవచ్చని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించవద్దని, రోడ్డు భద్రతకు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.