×
Ad

Delhi blasts: హైదరాబాద్‌లో పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తం.. దేశంలోని నగరాల్లో హైఅలర్ట్

కారు పేలుడు సంభవించడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.

Delhi blasts

Delhi blasts: ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోస్టేషన్‌ గేట్‌ నంబర్ 1 వద్ద కారు పేలుడు సంభవించడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో పేలుడుతో దేశంలోని నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌లో పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. పాతబస్తీలో పోలీసులు సోదాలు చేస్తున్నారు.

Also Read: మొన్న హ్యాకింగ్.. నిన్న స్లీపర్ సెల్స్ అరెస్ట్.. ఇవాళ ఢిల్లీలో కారు పేలుడు.. ఇదంతా ఉగ్రవాదుల పనేనా?

ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు స్థలానికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌జీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) బృందాలు, ఫోరెన్సిక్ శాఖ బృందం చేరుకున్నాయి. ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం బృందం, సీఆర్పీఎఫ్ డీఐజీ అక్కడికి వచ్చి పరిశీలించారు.

ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుతో ఢిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రి వెలుపల భద్రత ఏర్పాటు చేశారు. పేలుడు స్థలంలో గాయపడినవారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు, ఢిల్లీ పోలీసు కమిషనరుతో కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఎర్రకోట సమీపంలో కారు పేలుడుతో మహారాష్ట్రలోని ముంబై, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు.