తొమ్మిదో తరగతి బాలుడికి బర్త్‌డే బంప్స్ ఇచ్చిన తోటి విద్యార్థులు.. ఆ తర్వాత..

కొన్నిసార్లు శ్రుతి మించి కొడుతుంటారు.. పిడిగుద్దులు కురిపిస్తుంటారు. ఇటువంటి ఘటనే నాచారంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో తాజాగా చోటుచేసుకుంది.

Representative image

Birthday bumps: పుట్టినరోజు వేడుకలో స్నేహితులు బర్త్‌ డే బాయ్‌ని సరదాగా ఆటపట్టించడం సహజమే. అయితే, బర్త్‌డే బంప్స్ పేరిట అతడిని తీవ్రంగా కొట్టే సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లోనూ పెరిగిపోతోంది.

బర్త్‌డే బంప్స్ అంటే పుట్టినరోజు జరుపుకుంటున్న వ్యక్తిని కేక్‌ కట్‌ చేశాక స్నేహితులు పైకి ఎత్తి గాల్లోకి ఎగరేస్తూ, కాళ్లతో తడుతూ అతడి వయసుకు సరిపడినన్ని బంప్స్ ఇవ్వడం. ఇటువంటివి మజా కోసం చేస్తుంటారు.

అయితే, కొన్నిసార్లు శ్రుతి మించి కొడుతుంటారు.. పిడిగుద్దులు కురిపిస్తుంటారు. ఇటువంటి ఘటనే నాచారంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో తాజాగా చోటుచేసుకుంది. స్నేహితులు శ్రుతి మించి కొట్టడంతో అతడి ప్రాణాల మీదకు వచ్చింది.

Also Read: 16 నెలల బాబుకు టెలీ రోబోటిక్ సర్జరీ.. 1600 కి.మీ. దూరం నుంచి.. దీని గురించి తెలుసుకోవాల్సిందే..

పుట్టినరోజు కావడంతో లంచ్‌ సమయంలో అతడిని పట్టుకుని తోటి విద్యార్థులు బర్త్‌డే బంప్స్‌ ఇచ్చారు. ఆ బాలుడి మర్మాంగాలకు తీవ్ర గాయాలై, వృషణాలు ఉబ్బి రక్తం కారింది. ఆ తర్వాత బాధిత బాలుడిని స్కూల్‌ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.

ఆ బాలుడికి బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగింది. మూడు నెలలపాటు అతడు బెడ్‌రెస్ట్‌ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. వృషణాలకు శస్త్రచికిత్స చేయడంతో అతడిని ప్రాణాపాయం తప్పింది. పలువురు స్టూడెంట్స్‌, స్కూల్‌ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.