Driving Licence: హైదరాబాద్‌లో వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇక నుంచి ఇది దగ్గర ఉండాల్సిందే.. లేదంటే.. మార్చి 1 నుంచి
ఇక నుంచి నగరమంతా నిరంతర తనిఖీలు ఉంటాయని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసుల హెచ్చరించారు.
- Naveen
- Published On : February 11, 2026 / 06:00 AM IST
Hyderabad Traffic Police Representative Image (Image Credit To Original Source)
- మార్చి 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులపై స్పెషల్ డ్రైవ్‌లు
- డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు
- డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రైవర్ల వల్లే ఎక్కువ ప్రమాదాలు
Driving Licence: హైదరాబాద్ లోని వాహనదారులకు బిగ్ అలర్ట్. మీ వాహనంతో రోడ్డుపైకి వస్తున్నారా? అయితే బీకేర్ ఫుల్.. డ్రైవింగ్ లైసెన్స్ దగ్గరే ఉంచుకోండి. లేదంటే చిక్కుల్లో పడటం ఖాయం. డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర లేకుండా వాహనంతో రోడ్డు మీదకు వస్తే ఇబ్బందులు తప్పవని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
మార్చి 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అని తేల్చి చెప్పారు. తనిఖీలు మరింత కఠినం చేస్తామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రైవర్లే ఎక్కువ ప్రమాదాలకు కారణం అవుతున్నారని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. దీంతో కొరడా ఝళిపించేందుకు రెడీ అయ్యారు.
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనంతో రోడ్డు మీదకు వస్తే తాట తీయనున్నారు. అంతేకాదు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనం ఇచ్చినా తప్పే అంటున్నారు పోలీసులు. వాహన యజమానులపైనా కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ రద్దు చేయిస్తామన్నారు. ఇక నుంచి నగరమంతా నిరంతర తనిఖీలు ఉంటాయని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసుల హెచ్చరించారు. రోడ్డు భద్రతకు ప్రజల సహకారం అవసరం అని చెప్పారు. ఈ మేరకు జోయల్ డేవిస్ (జాయింట్ సీపీ ట్రాఫిక్ హైదరాబాద్) విజ్ఞప్తి చేశారు.
