Traffic Jam : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. హైదరాబాద్ – విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్

ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు రాకపోకలు సాగిస్తుండడంతో రద్దీ ఏర్పడింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి.

traffic jam

Hyderabad-Vijayawada highway Traffic Jam : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ రద్దీ ఏర్పడింది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు రాకపోకలు సాగిస్తుండడంతో రద్దీ ఏర్పడింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. అలాగే ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంతూళ్లకు వెళ్తున్న వారితో ఎంజీబీఎస్ బస్టాండ్ కిక్కిరిసింది.

ఎంజీబీఎస్ బస్టాండ్ లోని పలు ఫ్లాట్ పామ్స్ దగ్గర ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. సూర్యాపేట, మహబూబ్ నగర్, ఖమ్మం, కోదాడ మార్గాల్లో బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ పిలుపునిచ్చాయి. హైదరాబాద్ లో నివసిస్తున్న గ్రామాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వంతూళ్లకు తరలి వెళ్తున్నారు. ఈనేపథ్యంలో ఎంజీబీఎస్ వద్ద ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఓటు వేసేందుకు వెళ్లున్న ప్రయాణికులతో బస్టాండ్ కిటకిటలాడుతోంది.

Also Read : గత ఎన్నికల కంటే ఈసారి మరింత మెజారిటీ వస్తుంది : మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు పో్లింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 119 నియోజకర్గాల్లో 2,290 మంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తెలంగాణలో 33 జిల్లాలోని 119 అసెంబ్లీ నియోజకర్గాలకు ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు.

Also Read: ఓటేసేందుకు సొంతూళ్లకు తరలి వెళ్తున్న ప్రజలు.. ఎంజీబీఎస్ బస్టాండ్ లో కిక్కిరిసిన ప్రయాణికులు

ఎన్నికల నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. పోలీసుల నిఘా నీడలో పోలింగ్ కొనసాగుతోంది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ జరుగుతోంది. లక్షమంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. డిసెంబర్ 3న ఓట్ల కౌంటింగ్ జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు